త్వరగా బరువు పెరగటం ఎలా - Weight gain tips telugu
సన్నగా ఉన్నవారు లావు కావాలంటే ఏం చేయాలి
Share :
ఈ రోజుల్లో బరువు తగ్గటం ఎలా అనే ప్రశ్నలతో పాటు, సులువుగా బరువు పెరగటం ఎలా అనే సమస్యతో అధికంగా బాధపడుతున్నారు. సరైన ఆహారం తీసుకోకపోవడం వలన లేదా సరైన పద్దతిలో ఆహారం తీసుకోకపోవడం వలన చాలా మంది సన్నగా ఉంటారు. జెన్యూ పరమైన కారణాల వలన కూడా చాలా మంది బరువు పెరగకుండా సన్నగా ఉంటారు.
మనం అందరం అందంగా చక్కగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాం. సన్నగా ఉండటం వలన చాలా మంది నిరుత్సాహ పడుతారు, సన్నగా ఉన్నవాళ్ళు బాధపడుతూ బరువు పెరటం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి నిరాశ చెంది ఉంటారు.
“సంపూర్ణ ఆరోగ్యంగా ఉండటానికి చిట్కాలు”
ఆరోగ్యంగా బరువు పెరగటం ఎలా - Healthy Weight gain tips in Telugu
మొదటగా బరువు పెరగాలి అంటే ఎటువంటి tensions, అదిక ఆలోచనలు లేకుండా ఉండాలి.
బరువు పెరగాలి అంటే ఆకలి ఉండాలి, తిన్న ఆహారం చక్కగా జీర్ణం కావాలి, మలవిసర్జన ఎటువంటి ఇబ్బంది లేకుండా జరగాలి ఇలా మలవిసర్జన సక్రమంగా జరగాలి అంటే ఉదయం లేవగానే 1 లీటర్ లేదా సరిపడా నీళ్ళు తాగాలి ఇలా చేయడం వలన సుఖ విరోచనం జరుగుతుంది. అ తరువత ఆకలి వేస్తుంది అప్పుడు చక్కగా సరైన ఆహారం తీసుకోవడం వలన చక్కగా బరువు పెరగవచ్చు.
బరువు పెరగటానికి తీసుకోవలిసిన ఆహార పదార్థాలు - Weight gain tips in Telugu
- వేరుశనగ పప్పు weight gain tipsలలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. వేరుశనగ పప్పుని తెలంగాణ ప్రాంతంలో పల్లీలు అంటారు. ప్రతి రోజు పచ్చి పల్లీలు తీసుకోవడం వలన చక్కగా బరువు పెరగవచ్చు 50 గ్రాముల పల్లీలను(వేరుశనగ పప్పు) రోజు రాత్రి నానబెట్టి ఉదయం అల్పాహారంలో మొలకలతో పాటు తీసుకోవచ్చు, వీటితో పాటు ఖర్జూర కూడా కలిపి తీసుకోవచ్చు ఇలా తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది, మరియు మనం తీసుకునే మాంసం కన్నా ఎక్కువ కాలరీలు, ప్రోటీన్స్ ఉంటాయి.
- Weight gain tipsలో అరటి పండు అతి ముఖ్యమైనది. ప్రతి రోజు ఉదయం 2 అరటిపండ్లు మరియు సాయంత్రం రెండు అరటి పండ్లు తినడం మంచిది అరటిపండులో చాలా రకాల పోషక విలువలు ఉంటాయి, అరటి పండు రోజు తీసుకోవడం వలన చక్కగా బరువు పెరుగుతారు.
- weight gain tipsలో రోజు ఉదయం పెరుగు అన్నం తినాలి, రాత్రి పూట పెరుగుతో అన్నం కలిపి ఉదయం తినాలి ఇలా రోజు చేయడం వలన చక్కగా బరువు పెరుగుతారు, western డైట్ లో ఈ పెరుగు అన్నం ఎక్కువగా తింటారు, పెరుగు అన్నంని probiotic food అంటారు. పెరుగులో చెక్కర వేసుకొని కూడా తినడం మంచిది, face glamor కూడా వస్తుంది.
- Weight gain tipsలలో పండ్లు ముఖ్యస్తానన్ని కలిగి ఉంటాయి. అనాస, మామిడి పండు మరియు సీతాపలం వంటి పండ్లు తినడం వలన చక్కగా బరువు పెరుగుతారు.
- weight gain tipsలలో అన్నం ఎక్కువ తినడం అవసరం. బరువు పెరగాలి అనుకునే వారు అన్నం ఎక్కువగా తినాలి, పప్పులు ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి కందిపప్పు, పెసరపప్పు వంటి పప్పులను తీసుకోవడం చాలా మంచిది.
- Weight gain అవ్వడానీకి కొబ్బరిలో ఎక్కువ పోషక విలువలు ఉంటాయి. బరువు పెరగటానికి కొబ్బరి ముక్కలు బెల్లంతో కలిపి ఉదయం మరియు సాయంత్రం తినడం వలన బరువు త్వరగా పెరగటంతో పాటు దృడంగా బలంగా ఉంటారు.
- బాదం, జీడిపప్పు, పుచ్చగింజల పప్పులను, walnuts వీడి విడిగా నానబెట్టి బరువు పెరిగే వరకు రోజు తినడం మంచిది చక్కగా బరువు పెరుగుతారు.
- eggs రోజు కనీసం 2 నుండి 3 eggs తినడం వలన ఆరోగ్యంగా ఉంటాము మరియు బరువు పెరగటానికి ఉపయోగపడుతుంది.
బరువు పెరగటానికి తీసుకోవలిసిన బెస్ట్ డ్రింక్ - Weight gain tips in telugu
- బరువు పెరగడానికి చక్కటి drink రెండు అరటి పండ్లు 7 బాదంలు 8 ఎండు ద్రాక్షలు,వేడిచేసి చల్లార్చిన చిక్కటి పాలు కలిపి మిక్సీ పట్టి రోజు ఉదయం తాగితే చక్కగా బరువు పెరుగుతారు. ఇందులో 1 స్పూన్ ఆవు నెయ్యి లేదా, తీపి కోసం తేనె (లేదా) చెక్కర కలుపుకొని తాగడం మంచిది.
చియా విత్తనాలతో ఎన్నో ప్రయోజనాలు
మన శరీరాన్ని ఆరోగ్యంగా వుంచడానికి chia seeds చక్కగా ఉపయోగపడుతాయి.
బరువు పెరగటానికి పౌడర్ - weight gain tips in telugu
ఖజు ఒక కప్పు, walnuts ఒక కప్పు, బాదం ఒక కప్పు పల్లీలు ఒక కప్పు ,పిస్తా పప్పు ఒక కప్పు వీటన్నిటిని తీసుకొని వీడి విడిగా దోరగా పచ్చిదనం పోయేలా వేయించాలి ఆతరువత చల్లారిన తరువాత మిక్సీ పట్టాలి ఈ పౌడర్ని పాలలో రెండు స్పూన్స్ చల్లుకొని ఉదయం, సాయంత్రం తగవచ్చు లేదా నీటిలో కలుపుకొని తేనెతో కూడా తగవచ్చు, ఇలా రోజు తాగడం వలన త్వరగా బరువు పెరుగుతారు. మనం రోజు తీసుకొనే కూరలలో కూడా చల్లుకోవచ్చు.
బరువు పెరగడానికి exercise కూడా అవసరం
- బరువు పెరగటానికి వివిద రకాల మరియు ప్రోటీన్స్ అదికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకుంటూ ఉంటాం, కాబట్టి pimples అయ్యే అవకాశం ఉంటుంది. కావున walking లాంటి చిన్న చిన్న exercises చేస్తుండలి ఇలా చేయడం ఆరోగ్యానికి మంచిది మరియు తిన్న ఆహారం జీర్ణం అయి మళ్ళీ ఆకలి వేయడానికి సహాయపడుతుంది, ఇలా exercise చేయడం కూడా బరువు పెరగడానికి ఉపయోగపడుతుంది.
Frequently Asked Questions about weight gain tips in Telugu
బరువు పెరగటానికి ఉత్తమమైన పద్దతి ఆకలి అయిన ప్రతిసారీ తినడం ఎక్కువ ప్రోటీన్స్ ఉండే ఆహార పదార్థాలు తినడం. eggs, పాలు dry fruits రోజు తీసుకోవడం.
నిద్ర బరువు తగ్గడానికి సహాయపడుతుంది బరువు పెరగటానికి కాదు.
బరువు పెరగటానికి గుడ్డు తినడం మంచిదే కానీ ఒక ఆహార పదార్థం మాత్రమే బరువు పెరగటానికి సరిపోదు.
బరువు పెరగటానికి ఎక్కువ పోషకాలు ఉండే ఆహార పదార్థాలు eggs, పాలు, dry fruits, మాంస ఆహారం రోజు తీసుకోవలి.
ఫ్రైడ్ ఫూడ్స్ తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. బరువు పెరగాటానికి ఉపయోగపడదు.
Published by
Health Tips telugu
healthtipstelugu.in is the best resource for quality health tips in Telugu. Our website provides visitors with an easy way to find the best health tips for staying healthy and fit. We provide reliable health information in an easy-to-understand format, so you can make the most of your health.
Health Tips Telugu is founded and maintained by a group of medical professionals and health enthusiasts passionate about providing accurate, up-to-date health information to Telugu speakers around the world. We follow strict editorial practices to provide only truthful, unbiased health guidance that readers can rely on. We reference reputable health organizations, academic medical centers and peer-reviewed journals when developing our articles.