చియా విత్తనాలలో ఉన్న ఆరోగ్య రహస్యాలు - Chia Seeds in Telugu
Chia Seeds Benefits in Telugu
Share :
Chia seeds Meaning in Telugu
Chia Seeds ని తెలుగులో “చియా విత్తనాలు లేదా చియా గింజలు” అని అంటారు.
మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి chia seeds చక్కగా ఉపయోగపడుతాయి. చియా సీడ్స్ లో లాగానే flax seedsలో కూడా అనేక పోషక విలువలు ఉంటాయి.
“flax seeds లోని పోషక విలువలు ఇక్కడ తెలుసుకోండి”
50% off : అతి తక్కువ ధరకి చియా విత్తనాలని Amazon లో Order చేస్కోండి
చియా విత్తనాలు తినండి ఆరోగ్యంగా జీవించండి
కింద ఉన్న link క్లిక్ చేసి Discount పొందండి
Chia Seeds Price : ₹ 159
Chia seeds నలుపు, తెలుపు, బూడిద రంగులో రకరకాలుగ ఉంటాయి. Chia seedsలో omega 3 fatty acids, fiber, ప్రోటీన్స్ calcium, ఖనిజలవనాలు, magnesium, మంగనీస్, పాస్పరస్ మరియు antioxidants అధికంగా ఉంటాయి. సులువుగా జీర్ణం అవటం మరియు ఆహార పదార్థాలలో కలుపుకునే వీలు ఉండటం వలన వీటిని ఎక్కువగా వాడుతారు.
chia seeds మెక్సికోలో పుట్టినప్పటికీ వాటి ఔషధ గుణం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించి వాటి ప్రాముఖ్యతను పెంచుకుంది.
ఈ chia seeds పుదిన రకానికి చెందినది, salvia hispanica అనే scientific name కలిగిన మొక్క నుండి chia seeds వస్తాయి. మనం తీసుకునే ఆహారంతో పాటు chia విత్తనాలను కూడ తీసుకోవచ్చు.
chia seeds ఉపయోగాలు
- మన శరీరంలోని ప్రొటీన్ లోపాన్ని తగ్గించడానికి chia seeds తినడం అలవాటు చేసుకోవాలి.
- మన శరీరంలోని ఎముకలకు అవసరమయే calcium chia seeds లో సమృద్ధిగా దొరుకుతుంది.
- chia seeds పాలతో కలిపి తీసుకోవడం వలన ఎముకలు బలంగా దృడంగా తయారు అవుతాయి.
- వయసు పైబడిన తరువాత జ్ఞాపకశక్తి తగ్గుతూ ఉంటుంది. chia seeds తినడం వలన జ్ఞాపకశక్తి మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది.
- chia seeds లో fiber ఎక్కువగా ఉండటం వలన జీర్ణాశయాన్ని మెరుగుపరచి ఆహారం చక్కగా జీర్ణం చేయడానికి ఉపయోగపడుతుంది.
బరువు తగ్గడానికి చియా విత్తనాలు ఎలా వాడాలి?
బరువు తగ్గాలి అనుకునే వారికి chia seeds చక్కటి ఔషధంలాగా పనిచేస్తాయి, chia seeds తినడం వలన పొట్టనిండినట్టు ఎక్కువగా ఆకలి లేకుండా చేస్తాయి.
బరువు తగ్గడానికి చిట్కాలు ఇక్కడ తెలుసుకోండి.
బరువు తగ్గడానికి 1 spoon chia గింజలు గోరువెచ్చని నీటిలో వేసి బాగా కలిపీ కొంచెం నిమ్మ రసం తేనె కలిపీ తీసుకోవడం వలన, chia గింజలలో fiber అధికంగా ఉంటుంది, ఈ ఫైబర్ జీర్ణక్రియను సాఫీగా జరగటానికి తోడ్పడుతుంది మరియు బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. చియా విత్తనాలను ఒక 20 నిమిషాల పాటు నానబెట్టి మొలకలతో లేదా ఫ్రూట్ సలాడ్స్ లలో కూడా పైన చల్లుకొని తీసుకోవచ్చు. బాగా నమిలి తినాలి. ఇలా చియా విత్తనాలను రోజు తింటే షుగర్, మలబద్దకం మరియు కొలెస్ట్రాల్ వంటి సమస్యలను తగ్గించడానికి చక్కగా ఉపకరిస్తుంది.
- గ్లూకోస్ absorption నెమ్మదించడానికి సహకరిస్తుంది.
- ఈ చియా విత్తనాలు ఆహార పదార్థాలను తొందరగా fat గా మార్చేడాన్ని నెమ్మదిగా జరిగేలా చూస్తుంది.
Download Free PDF
మీరు ఖాళీగా ఉన్న సమయంలో చియా సీడ్స్ గురించి చదవాలనుకుంటున్నారా ?
అయితే ఇప్పుడే మేము అందించే Free PDF ని డౌన్లోడ్ చేసుకొని, మీరు ఖాళీగా ఉన్న సమయం లో చదువుకోండి
చియా విత్తనాలు ఎలాంటి అనారోగ్య సమస్యలు దూరం చేస్తుంది?
- జుట్టు మరియు చర్మ సమస్యలను దూరం చేయడానికి chia vithanalu చక్కగా పనిచేస్తాయి. అలాగె chia విత్తనాలతో facepacks కూడ వేసుకోవచ్చు.
- chia విత్తనాలు బ్రెస్ట్ cancer మరియు cervical cancer నుండి రక్షించడానికి సహయపడుతాయి.
- chia విత్తనాలు తినడం వలన స్థులకాయంతో భాదపడే వారికి చక్కని ఔషధంలా పని చేస్తుంది.
- chia గింజలు రక్తంలోని చక్కెరని క్రమబద్దికరిస్తుంది, అలాగే శరీరంలో ఇన్సులిన్ స్తాయిలను నియంత్రించడంలో మంచి పాత్ర పోషిస్తాయి.
- సరైన పద్దతిలో చియా విత్తనాలు తీసుకోవడం వలన త్వరగా వృద్ధాప్యం రాకుండ ఉండటానికి ఉపయోగపడుతాయి.
- బరువు తగ్గడానికి చియా గింజల్లోని ఫైబర్ మరియు ప్రోటీన్ కడుపు నిండుగా ఉంచడానికి సహాయపడతాయి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అవి కొవ్వును బర్న్ చేయడానికి కూడా సహాయపడతాయి.
- చియా గింజల్లోని ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది.
chia seed recipe in telugu
బరువు తగ్గడానికి ఉత్తమమైన పద్దతిలో ఇలా తయారు చేసుకోని ఉపయోగిస్తే, అధిక ప్రయోజనాన్ని పొందవచ్చు .
ఈ పదార్థం ఒక వ్యక్తికి తినడానికి సరిపోతుంది, మనకు ఎంత మందికి కావాలి అంటే అంతా ఎక్కువ చేసుకోవచ్చు. ఒక కప్పు బాధం పాలు తీసుకొని అందులో 2 స్పూన్స్ చియా సీడ్స్ ని వేసి బాగా కలపాలి ఒక రాత్రి మొత్తం లేదా 3 గంటల సేపు నానబెట్టిన తరువాత మన breakfast చేసేటప్పుడు, fruits వేసుకొని తినాలి. ఈ recipeని మూడు రోజులకు సరిపడా కూడా చేసుకోవచ్చు.
how to Prepare Chia Seeds drink in telugu
Chia Vithanala డ్రింక్ తయారు చేయడానికి ఒక గ్లాస్ నీళ్ళలో ఒక స్పూన్ చియా విత్తనాలను వేసి బాగా కలపాలి అలాగే ఒక స్పూన్ తేనె వేసి బాగా కలపాలి ఆ తరువాత ఒక స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలపాలి 5 పుదీనా ఆకులు వేసి బాగా కలిపి 30 నిమిషాల తరువాత ఆ డ్రింక్ తాగాలి. ఈ డ్రింక్ ని బరువు తగ్గడానికి పడిగడుపున లేదా అన్నం తిన్న ఒక గంట తరువాత తగవచ్చు. ఇలా డ్రింక్ తాగడం వలన మన శరీరానికి సరిపడా పోషకాలు అందడమే కాకుండా ఆరోగ్యంగా ఉండటానికి రోజంతా ఉత్సాహంగా, శక్తి వంతంగా ఉండటానికి ఉపయోగపడుతుంది. చర్మ సమస్యలను దూరం చేస్తుంది.
చర్మ సౌందర్యానికి chia seeds
చియా గింజలు ఆహారంలోనే కాదు, ముఖానికి కూడా చాలా మేలు చేస్తాయి. వాటిలో ఉండే పోషకాలు చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచడానికి సహాయపడతాయి.
1. ముడతలు తగ్గిస్తాయి: చియా గింజల్లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి చర్మం నష్టాన్ని నివారించడానికి సహాయపడతాయి. ఫలితంగా చర్మం యవ్వనంగా కనిపిస్తుంది, ముడతలు పడకుండా ఉంటాయి.
2. హైడ్రేషన్: చియా గింజలు చర్మాన్ని తేమగా ఉంచడానికి సహాయపడతాయి. వాటిలో ఫైబర్ మరియు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి, ఇవి చర్మాన్ని హైడ్రేట్ చేసి మృదుత్వాన్ని పెంచుతాయి.
3. మొటిమలు తగ్గిస్తాయి: చియా గింజల్లో యాంటీ-ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి, ఇవి మొటిమలు మరియు చర్మపు ఎర్రదనాన్ని తగ్గించడానికి సహాయపడతాయి. విటమిన్ ఇ కూడా ఉంటుంది, ఇది చర్మాన్ని రిపేర్ చేసి మచ్చలను తగ్గిస్తుంది.
4. యువి రక్షణ: చియా గింజల్లో యాంటీఆక్సిడెంట్లు సూర్యుడి నుండి వచ్చే హానికర యువి కిరణాల నుండి చర్మాన్ని రక్షించడానికి సహాయపడతాయి.
5. చర్మపు కాంతి: చియా గింజల్లో విటమిన్ c మరియు జింక్ వంటి పోషకాలు చర్మాన్ని ప్రకాశవంతంగా మరియు కాంతివంతంగా మార్చడానికి సహాయపడతాయి.
చియా గింజలను ఫేస్ ప్యాక్‌లా, స్క్రబ్‌లా లేదా నేరుగా కూడా చర్మానికి రాసుకోవచ్చు .
- ఫేస్ ప్యాక్: ఒక టీస్పూన్ చియా గింజల పొడిని, ఒక టేబుల్ స్పూన్ పెరుగు లేదా తేనెతో కలిపి ముఖానికి రాసుకోండి. 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేయండి.
- స్క్రబ్: ఒక టీస్పూన్ చియా గింజల పొడిని, కొద్దిగా యాపిల్ సాస్‌తో కలిపి ముఖానికి మృదువుగా మసాజ్ చేయండి. 5 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేయండి.
- డైరెక్ట్ అప్లికేషన్: కొన్ని చియా గింజలను నీటిలో నానబెట్టి, పేస్ట్ చేసి ముఖానికి రాసుకోండి. 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేయండి.
చియా గింజలను ముఖానికి ఉపయోగించే ముందు ప్యాచ్ టెస్ట్ చేయడం మంచిది. అతిసారంతో బాధపడే వారు చియా గింజలను జాగ్రత్తగా ఉపయోగించాలి.
చియా సీడ్స్ ఫేస్ ప్యాక్
మన చర్మం అందంగా మెరుస్తూ కనిపించడానికి చియా సీడ్స్ తో ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు, చియా విత్తనాలను రెండు spoons తీసుకొని పచ్చి పాలను సరిపడ వేసి కలిపి ఒక రాత్రి మొత్తం అలానే ఉండానివ్వాలి. మరుసటి రోజు మిక్సీ లో వేసి పేస్ట్ లాగా తయారు చేయాలి అందులో ఒక స్పూన్ పెరుగు మరియు ఒక విటమిన్ E capsules వేసి కలుపుకోవాలి. ఆ తరువాత ముఖానికి ఈ పేస్ట్ ని రాసుకోవాలి 20 నిమిషాల తరువాత pack తీసేసి వాటర్ తో కడిగేసుకోవాలి. చర్మం చక్కగా స్మూత్ గా తయారు అవుతుంది.
2 స్పూన్ల chia విత్తనాలలో ఏమేం ఉంటాయి
- 11 grams fiber ఉంటుంది.
- 4 grams protein ఉంటుంది.
- 9 grams fat ఉంటుంది.
- 18% calcium ఉంటుంది.
- Magnesium 30% ఉంటుంది.
- మాంగనీస్ 30% ఉంటుంది.
- పాస్పరస్ 27% ఉంటుంది.
- chia విత్తనాలలో ఒక గ్లాస్ పాలలో కంటె calcium ఎక్కువ ఉంటుంది.
- ఒక కప్పు పాలకుర కన్న chia గింజలలో iron అధికంగా ఉంటుంది.
- chia విత్తనాలలో antioxidants blueberries కన్న ఎక్కువగా ఉంటాయి.
chia విత్తనాలను మనం తీసుకునే ఆహారంతో పాటు తీసుకోవడం వలన మన ఆరోగ్యానీకి చాల మంచిది.
chia పంటను తెలంగాణలో కూడా పండిస్తున్నారు. ఎటువంటి వాతావరణ పరిస్థులలో అయిన ఈ పంటను పండించుకోవచ్చు.
chia విత్తనాలలోని omega 3 fatty acids walnuts కంటె ఎక్కువగా ఉంటాయి.
“walnuts గురించి పూర్తిగా ఇక్కడ తెలుసుకోండి”
50% off : అతి తక్కువ ధరకి చియా విత్తనాలని Amazon లో Order చేస్కోండి
చియా విత్తనాలు తినండి ఆరోగ్యంగా జీవించండి
కింద ఉన్న link క్లిక్ చేసి ఇప్పుడే order చేస్కోండి
చియా విత్తనాలు price : ₹ 159
chia విత్తనాలను ఎవరు వాడకూడదు ?
- chia విత్తనాలు ఆరోగ్య సమస్యలు ఉన్నవారు నిపుణుల సలహ తీసుకొని వాడటం మంచిది.
- kidney సమస్యతో బాధ పడేవారు chia vithanalu తీసుకోకూడదు.
- గర్బవతులు, బాలింతలు మరియు చిన్న పిల్లలు chia vithanalu తీసుకోకూడదు.
- ఒక రోజుకి ఒక spoon కంటె ఎక్కువగా తీసుకోకూడదు.
- Prostate గ్రంథి సమస్య ఉన్నవారు chia విత్తనాలను తీసుకుంటే, వీటిలో alpha linoleic acid ఉండటం వలన సమస్య ఎక్కువ అయ్యె అవకాశం ఉంది.
- chia vithanalu అధికంగా వాడటం వలన కడుపు నొప్పి ,diarrhea వచ్చే అవకాశం ఉంది.
Frequently Asked Questions about Chia Seeds in Telugu
Chia Seeds ని తెలుగులో “చియా విత్తనాలు లేదా చియా గింజలు” అని అంటారు.
చియా సీడ్స్ ని ఫ్రూట్ సలాడ్స్ తో తినవచ్చు 1 spoon chia గింజలు గోరువెచ్చని నీటిలో వేసి బాగా కలిపీ కొంచెం నిమ్మ రసం తేనె కలిపీ తినవచ్చు.
చియా విత్తనాలు మన ఆరోగ్యానికి మంచివే కానీ ఆహార అలెర్జీ లేదా ముఖ్యమైన జీర్ణ సమస్య లేకపోతే చియా సీడ్స్ తీసుకోవచ్చు.
బరువు తగ్గటానికి చియా సీడ్స్ ఉపయోగపడుతాయి. chia seeds తినడం వలన పొట్టనిండినట్టు ఎక్కువగా ఆకలి లేకుండా చేస్తాయి.రోజుకి ఒక స్పూన్ చియా సీడ్స్ మనం తీసుకెన్ ఆహారంలో తీసుకోవచ్చు.
చియా గింజలు ఉబ్బడానికి సుమారు 5-10 నిమిషాలు నీటిలో నానబెట్టాలి. మీరు గింజలను నమలవచ్చు మరియు దానిని మింగవచ్చు లేదా మీరు వాటిని నమలడానికి ఇష్టపడకపోతే నేరుగా వాటిని మింగవచ్చు.
Disclaimer: This post may include affliate links. lf you click one of them, we may receive a cute
commission at no extra cost to you. Thank you.
Published by
Health Tips telugu
healthtipstelugu.in is the best resource for quality health tips in Telugu. Our website provides visitors with an easy way to find the best health tips for staying healthy and fit. We provide reliable health information in an easy-to-understand format, so you can make the most of your health.
Health Tips Telugu is founded and maintained by a group of medical professionals and health enthusiasts passionate about providing accurate, up-to-date health information to Telugu speakers around the world. We follow strict editorial practices to provide only truthful, unbiased health guidance that readers can rely on. We reference reputable health organizations, academic medical centers and peer-reviewed journals when developing our articles.