9 Health Tips in Telugu
ఆరోగ్య చిట్కాలు తెలుగులో
ఆరోగ్యవంతమైన జీవితం గడపాలంటే ఈ 9 health tips ఫాలో అయితే మీరు చాలా Healthy గా ఫిట్ గా అవుతారు.
ఆరోగ్యంగా ఉండటానికి ఏమేం చెయ్యాలి ?
1. నీరు ఎక్కువగా తీసుకోవాలి
మన శరీరంలో నీరు అతి ముఖ్యమైనది. అయితే ఈ నీటిని మన శరీరానికి కావలసినంత తీసుకోవాలి. నీటిని సరిపడ తీసుకోవడం వలన ఆరోగ్య సమస్యలు రాకుండ వుంటాయి.
నీటిని సరిపడ తాగడం వలన శరీరంలోని అవయవాలు చురుకుగా పని చేయడానికి సహాయపడుతాయి.
- షుగర్ వ్యాది ఉన్నవారు నీటిని వారి శరీరానికి సరిపడ తాగడం వలన షుగర్ స్థాయిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
- Cancer వ్యాది వున్నవారు కూడా సరిపడ నీటిని తాగడం వలన కొంత వరకు cancer వ్యాదిని నియంత్రించవచ్చు.
- రోజూ ఉదయం లేవగానే 1-2 గ్లాసుల నీటిని తాగాలి. అలా తాగడం వలన జీర్ణ ఆశయం శుభ్రపరచి మలబద్దకం సమస్య లేకుండ సుఖ వీరోచనం అవడానికి వుపయోగ పడుతుంది
- మన శరీరంలో 70% నీరు వుంటుంది.
ఆరోగ్యంగా ఉండటానికి నీరు ఎలా ఉపయోగపడుతుంది?
- మెదడు మరియు గుండెలలో 73% నీరు కలిగి ఉంటుంది.
- ఊపిరితిత్తులు 83% నీటిని కలిగి ఉంటాయి.
- చర్మం 64% నీటిని కలిగి ఉంటుంది.
- ఎముకలలో 31% నీటిని కలిగి ఉంటుంది
దీనిని బట్టి మన శరీరానికి మరియు మనం బ్రతకడానికి నీరు ఎంత అవసరమొ తెలుస్తుంది.
శరీరంలో వేడిని తగ్గించడానికి నీరు ఎలా ఉపయోగపడుతుంది
- కాలన్ని బట్టి మరియు మనం చేసె పనిని బట్టి మన శరీరంలో నీటి వినియోగం అనేది ఉంటుంది.
- పొట్ట మరియు ప్రేగులలో వేడిని తగ్గించడానికి 1/2 liters నీరు ఖర్చు అవుతుంది.
- చెమట మరియు మూత్రం రూపంలో 1/2 నుండి ఒక liter వరకు నీరు ఖర్చు అవుతుంది.
ఒక రోజులో మన శరీరంలో నీరు రెండున్నర లీటర్ల వరకు ఖర్చు ఆవుతుంది.
ఒక రోజుకి 4-5 liters వరకు నీటిని తాగడం వలన ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడుతుంది
కడుపులో మంట, దగ్గు మరియు ఆస్థామ వంటి వ్యాదులు ఉన్నవారు గోరు వెచ్చని నీటిని తాగడం ఛాలా మంచిది.
వర్ష కాలము మరియు చలి కాలము గోరు వెచ్చని నీటిని తాగడం చాల మంచిది, కాని వేసవి కాలంలో గోరు వెచ్చని నీటిని తాగడం మంచిది కాదు.
ఆహారం తీసుకునే ఒక అరగంట ముందు నీటిని తగాలి, ఆహారం తీసుకునే సమాయంలో నీటిని
తీసుకోరాదు, ఆహారం తీసుకున్న ఒక గంట తర్వాత నీటిని తాగాలి.
- 16-60 వయసు గల స్త్రీలు 4-5 liters నీటిని రోజూ తాగడం మంచిది.
- 60 సంవత్సరాలు పైబడిన వారు 3-4 liters నీరు తాగడం మంచిది.
- పురుషులు ఎండలో పని చేసే వారు 5 liters వరకు తాగాలి.
- 70 సంవత్సరాలు పైబడిన వారు 3 liters నీటిని తాగాలి
- 16 సంవత్సరాలు కంటె తక్కువ వయసు వారు 3 liters నీటిని తాగాలి
- 10 సంవత్సరాలు వయసు మరియు ఇంకా తక్కువ వయసు వారు 2 liters వరకు నీటిని తాగాలి.
- అప్పుడే పుట్టిన పిల్లలకు నీటిని తాగించరాదు, 3 నెలల వయస్సు తరువత నీటిని తాగించాలి.
kidney సమస్యలు ఉన్నవారు నీటిని ఎక్కువగా తాగాలి
kidneyలో రాళ్లు వున్నవారు నీటిని అధికంగా తాగాలి. ఇలా నీటిని అధికంగా తాగటం వలన kidney సమస్య పూర్తిగా తగ్గుతుంది. kidneyలో రాళ్లు ఉన్నవారు ప్రతి గంటకి ఒక Glass నీటిని తాగాలి. బయట తిరిగే వారు లేదా ఎండకి వెళ్లె వారు గంటకు 2 గ్లాసుల నీళ్లు తాగాలి. రెండు kidneyలు పని చేయని వారు, గుండె సమస్యలు ఉన్నవారు వారి పరిస్థితిని బట్టి నీటిని తాగాలి.
అధిక బరువుతో బాధపడుతున్నవారు నీరు ఎలా తాగాలి
గోరు వెచ్చని నీటిలో కొంచెం నిమ్మ రసం మరియు తేనెతో పాటు తీసుకోవడం వలన బరువు తగ్గడంతో పాటు Gastro సమస్యలు కూడా పోతాయి . మనం తీసుకునే ఆహారంలో పోషకలు మరియు ఖనిజ లవణాలు శరీరం గ్రహించే శక్తి పేరుగుతుంది.
“బరువు తగ్గడానికి చిట్కాలు”
తిన్న అహారం జీర్ణం అవడంతో పాటు శరీరంలో కొవ్వు పెరగకుండా ఉపయోగపడుతుంది.
నిమ్మ రసంలో alkaline అనే ఎంజైమ్ ఉండటం వలన మన శరీరంలో హానికరం అయిన టాక్సిన్స్ ని బయటకి పంపడనికి ఉపయోగపడుతాయి.
శరీరంలోని PH విలువలు తగిన స్థాయిలో ఉండటానికి నిమ్మ ఉపయోగపడుతుంది.
ఈ నిమ్మ రసంలో ఉండె విటమిన్ C శరీరంలో రోగనిరోదక శక్తి పెరగటానికి ఉపయోగపడుతుంది. శరీరాన్ని అనేక రకాల వ్యాదులు రాకుండ రక్షణ కవచం లాగా కాపాడుతుంది.
నీటిని అధికంగా తాగడం వలన ఆంటీ ఏజెంట్గా పని చేసి చర్మం ఆరోగ్యం కూడ మెరుగు పరచడానికి ఉపయోగపడుతుంది.
ఇలా రోజు సరిపడా నీరు తాగడం ద్వారా Healthy గా ఉండొచ్చు.
చియా విత్తనాలతో ఎన్నో ప్రయోజనాలు
మన శరీరాన్ని ఆరోగ్యంగా వుంచడానికి chia seeds చక్కగా ఉపయోగపడుతాయి.
2. ఆరోగ్యంగా ఉండాలి అంటే వ్యాయమం తప్పనిసరి
మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే వ్యాయమం తప్పకుండా చేయాలి. మన శరీరానికి శారీరిక శ్రమ కలిగించడమే వ్యాయమం. ఈ రోజుల్లో ప్రతి ఒకరు చేయాల్సింది, మన శరీరానికి అత్యంత అవసరం అయినది వ్యాయమం. వ్యాయామాన్ని చాలామంది పట్టించుకోకుండ ఉంటారు, వ్యాయమం తో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతి రోజూ సరి అయిన పద్దతిలో వ్యాయమం చేయడం వలన వైద్యుల దగ్గరకి వెళ్లె అవసరాన్ని తగ్గిస్తుంది
వ్యాయమంతో ఉపయోగాలు
- వ్యాయామాన్ని ప్రతి రోజూ చేస్తే పూర్తిగా ఆరోగ్యంగా ఉండటానికి సహాయ పడుతుంది. ఇలా వ్యాయమం చేయడం వలన ఎముకలు దృడంగా తయారవుతాయి.
- శరీర బరువుని తగ్గించి అవయవాలను సక్రమంగా ఉంచటానికి వ్యాయమం అవసరం.
- నిద్రలేమి, గుండె జబ్బు మరియు స్తులకాయం వంటి సమస్యలు ఉన్నవారు రోజూ ఉదయం వ్యాయమం చేయడం వలన మంచి ప్రయోజనాలు ఉంటాయి.
- వ్యాయమం చేయడం వలన మానసిక ఒత్తిడి తగ్గుతుంది. శారీరిక అందం మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
మొదటి రోజూ వ్యాయమం చేయడం వలన గుండె సామర్త్యం పేరుగుతుంది. ఆ తరువత మెదడు మరియు ఇతర అవయవాలకు రక్త సరఫరా పెరుగుతుంది. ఇలా జరగడం వలన రోజంతా ఉత్సాహంగా చురుకుగా ఉంటారు.
ఒక రోజూ వ్యాయమం చేయగానే delayed onset muscle soreness వస్తుంది, అంటే వొళ్ళు నొప్పులు వస్తాయి. దీని వలన ఎటువంటి సమస్యలు ఉండవు, మళ్ళీ క్రమం తప్పకుండా వ్యాయమం చేస్తు ఉంటె ఈ నొప్పులు తగ్గిపోతు ఉంటాయీ. ఇలా వ్యాయమం కొన్ని వారాలు వరకు చేయడం వలన మన శరీరంలోని కణాలలో ఉండె mitochondria పునరుత్పత్తి చెందటం ప్రారంభిస్తుంది.
ఈ mitochondria మనం తినె carbohydrates, ప్రోటీన్స్, క్రొవ్వులను శక్తిగా మారుస్తుంది, వ్యాయమం ప్రతి రోజూ, 6-8 వారాల పాటు చేయడం వలన 50% mitochondria పునరుత్పత్తి పెరుగుతుంది. ఇలా జరగటం వలన fitగా శక్తివంతంగా ఉంటారు.
వ్యాయామం కొన్ని నెలల పాటు చేయడం వలన VO2 max పెరగటం మొదలు ఆవుతుంది. VO2 max అనెది మనం తీసుకునే Oxygen మన శరీరం ఎంత స్థాయిలో గ్రహిస్తుంది అనేదాన్ని VO2 max అంటారు. ఇది క్రీడాకారులకు అధికంగా ఉంటుంది.
- ఒక సంవత్సరం పాటు వ్యాయమం చేయడం వలన ఎముకలు బలంగా,దృడంగా తయారు అవుతాయి, osteoporosis వచ్చే అవకాశం తగ్గుతుంది. ఇలా వ్యాయమం చేయడం వలన anxiety స్థాయి తగ్గిస్తుంది. Stress హార్మోన్ ఉత్పత్తి కూడా తగ్గిస్తుంది.
వ్యాయామానికి చాల రకాల పద్దతులు ఉంటాయి
- warmup
- cycling
- swimming
- jogging
- running
- skipping
Gym లో చేసె Exercises
- fitness training
- body build up
- weight reduction
- cross training
- aerobic
- dance therapy
- jumba
3. మంచి ఆహరం తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారు
ఆహారం మరియు ఆరోగ్యం పరస్పరం ఒక దాని పై ఒకటి ఆదరపడి ఉంటాయి.
మనం సంపూర్ణంగా మంచి ఆహరం తీసుకోవడం వలన ఆరోగ్యంగా జీవించవచ్చు. ఆహారం తినేటప్పుడు కనీసం 20 నిమిషాలు తినాలి, తినే ఆహారాన్ని బాగా నమిలి తినాలి.
పోషక ఆహారాలు
ఆకుకూరలు, కురాగాయలు, పండ్లు, మాంసకృతులు వీటిని తినడం ఆరోగ్యానికి మంచిది. మనం తీసుకునే ఆహారంలో పోషకాలు ఎక్కువగా వుండి కేలారీలు తక్కువ వుండి ప్రోటీన్స్ ఆదికంగా , కొవ్వు తక్కువ వుండాలి, సూక్ష్మ పోషకలు, విటమిన్స్, Minerals అధిక స్థాయిలో వుండాలి, పీచు పదార్థం ఉండాలి , సులభంగా జీర్ణం అవ్వాలి, ఆదికంగా antioxidants వుండాలి.
పోషక ఆహారంలో గుడ్డు మరియు పాలు అతి ముఖ్యమైనవి
- ఒక పెద్ద size గుడ్డులో సుమారు ఒక 7 grams వరకు protein ఉంటుంది.
- 250 మిల్లీ గ్రామ్స్ పాలలో 9 grams ప్రోటీన్స్ ఉంటాయి. వీటితో పాటు విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.
మెదడు చూరుకుగా పని చేయడానికి తీసుకోవాల్సిన అహారం
మెదడు చూరుకుగా ఉండాలి అంటే మంచి ఆహరం తీసుకోవాలి, మెదడు చూరుకుగా ఉన్నంత వరకు మనం ఆరోగ్యంగా ఉంటాము.
- walnuts లో అధికంగా పోషక విలువలు కలిగి ఉంటాయీ, వీటిలో ఉండే పోషకాలు మెదడు ఆరోగ్యానీకి ఉపయోగపడుతాయి, walnuts ని రోజూ ఒక పిడికెడు తీసుకోవడం వలన మెదడు సామర్థ్యాన్ని పెంచడానికి ఉపయోగపడుతాయి.
- అవిసె గింజలు చూడడానికి చాల చిన్నవిగా ఉంటాయి.
కానీ వీటిని తినడం వలన మెదడు శక్తిని పెంచటానికి ఉపయోగపడుతాయి. వీటిని పెరుగు లేదా Salads తో తినొచ్చు . - ధాన్యంతో తయారు చేసిన అహారం తీసుకోవడం ఆరోగ్యానీకి మంచిది.
మొలకెత్తిన విత్తనాలతో అరోగ్య ప్రయోజనాలు
మనం రోజూ తీసుకునే ఆహారంలో మొలకలను తీసుకోవడం వలన ఎక్కువ పోషకాలు మన శరీరానికి దొరుకుతాయి. ఈ మొలకలలో గల ఎంజైమ్ లు మన జీర్ణ స్థాయిని మెరుగు పరచడానికి ఉపయోగపడుతాయి. Cancer కారకలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అలాగే వీటిలో ఉండే enzymes క్లోరోఫిల్ స్తాయిని పెంచడంతో పాటు మన శరీరాన్ని detoxify చేయడానికి ఉపయోగపడుతుంది.
- మనం తీసుకునే అహారంలో 70% Alkaline ఆహరం, 30% acidic ఆహరం ఉండటం వలన జబ్బులు రాకుండ ఉంటాయి.
- మొలకలలో alkaline ఉండటం వలన శరీరంలో అసిడిటీని తగ్గిస్తాయి.
- 100 Grams వేరుశనగలలో 567 కాలరీలు ఉంటాయి. ఇవి తినడం వలన ఆరోగ్యానీకి చాల మంచిది, బరువు పెరగడానికి ఉపయోగపడుతాయి.
- 100 గ్రాముల పచ్చి కొబ్బరిలో 444 కాలరీలు ఉంటాయి. పచ్చి కొబ్బరి తినడం వలన మనం ఆరోగ్యంగా దృడంగా ఉండవచ్చు.
4. జీర్ణ సమస్యలు లేకుండా చూసుకోవాలి
ఆహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో తిన్న ఆహరం జీర్ణం అవడం కూడ అంతే ముఖ్యం. తిన్న ఆహరం జీర్ణం కాకపోవడం వలన చాల మంది బాధ పడుతుంటారు, ఇబ్బంది పడుతుంటారు.
- ఆహరం జీర్ణం కావలి అంటే మనం తినేటప్పుడు బాగా నమిలి తినాలి.
- ఆహరం సరిగ్గా జీర్ణం కాకపోవడం వలన మలబద్దకం, మరియు అసిడిటీ వంటి సమస్యలు వస్థాయి.
- కొవ్వు పదార్థాలు, fry చేసిన పదార్థాలు మరియు Junk foods తీసుకోవడం వలన అజీర్తి సమస్య మొదలవుతుంది.
- ఆహారం సమయానికి తినకపోవడం, మద్యపానం మరియు ఇతర కారణాల వాళ్ళ అజీర్తి సమస్య వస్తుంది.
ఆహారం జీర్ణం అవడానికి కొన్ని చిట్కాలు
- ఆహరం తీసుకున్న తరువాత గోరు వెచ్చని నీటిని తాగడం వలన మనం తిన్న అహారం చక్కగా జీర్ణం అవుతుంది.
- జీర్ణ శక్తి పెంచడానికి మరియు శరీరంలో వ్యర్థలు పోవడానికి నిమ్మ రసం ఉపయోగపడుతుంది.
- ప్రతి రోజూ ఒక గ్లాస్ నీటిలో నిమ్మరసం కలిపి తాగితే చాలు జీర్ణ సమస్య పోతుంది. చర్మ సౌందర్యం పెరిగేలా చేస్తుంది.
- అన్నం తిన్న తర్వాత కాస్త జీలకర్రని లేదా వాముని నీటిలో కలిపి తీసుకోవడం వలన జీర్ణ సమస్య పోతుంది.
- ఒకసారి ఆహరం తీసుకున్న తరువాత 4-6 గంటలు సమయం ఆగిన తర్వాతే మళ్ళీ ఆహరం తీస్కోవాలి.
- కొంచెం అల్లం నీటిలో వేసి మరిగించి, ఆ నీటిని తాగడం వలన ఆహారం చక్కగా జీర్ణం అవుతుంది.
5. మానసిక సమస్యలకు దూరంగా ఉండాలి
ఈ రోజుల్లో మానసిక సమస్యల వల్ల శారీరక సమస్యలు కూడ పెరుగుతూ వస్తున్నాయి .
మానసిక సమస్యల ప్రభావం వలన శరీరక సమస్యలు ఎక్కువ అవుతున్నాయి.
మన శరీరానికి మెదడు కేంద్రం కావున,
మన మెదడు చక్కగా పని చేయకపొతే ఆ ప్రభావం శరీరం పైన చూపుతుంది.
మానసిక సమస్యల ప్రభావం ఎలా ఉంటుంది
కోపం, tension, చిరాకు, ఒత్తిడి, భయం వంటివి ఉన్నప్పుడు, శరీరంలోని చెడు హార్మోనులు మన అవయవాలు చేసే పనిని మారుస్తూ ఉంటాయి.
మానసిక స్థితి బాగా లేనప్పుడు శ్వాస నాళాలు సన్నగా మారుతాయి, మనం శ్వాస తీసుకునే సామర్థ్యం మామూలుగా రెండు రేట్లు ఉంటే సగంకి పడిపోతుంటుంది, అంటే ఒక నాళం గుండ మాత్రమే శ్వాస తీసుకుంటుంది, ఇలా శరీరంలో ఆక్సిజన్ తగ్గేసరికి ఆవలింతలు రావటం, మొఖంలో feelings మారిపోతాయి.
మనసు బాగా లేకపోవడం వలన stress వలన రక్తనాలలో కూడ వాటి పని చేసే సామర్త్యం తగ్గిపోతూ ఉంటుంది. ఇలా జరిగినప్పుడు adrenal గ్రంథి నుండి హార్మోనులు ఉత్పత్తి అవుతాయి, శరీర క్రియ సరిగా చేయకుండా చేస్తాయి.
మనసు బాగా లేనప్పుడు ఆలోచనలు ఎక్కువగా రావటం జరుగుతుంది, ఇలా జరగటం వలన ముఖ్యమైన విషయాలలో తప్పు నిర్ణయలు తీసుకునే అవకాశం ఉంటుంది.
మానసిక ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకోవడం ఎలా ?
- శారీరిక ఆరోగ్యానీకి ఇచ్చే ప్రాముఖ్యతను మానసిక ఆరోగ్యానీకి కూడా ఇవ్వాలి.
- మానసిక ఒత్తిడి గురవడానికి ముందే మనం దైర్యంగా ఉండాలి, దృడంగా ఆత్మ విశ్వాసంతో ఉండాలి.
- మానసిక ఒత్తిడికి గురి అయినపుడు దాన్ని తగ్గించే దిశగా ఆలోచించాలి, బలంగా ఉండాలి.
6. ప్రశాంతంగా నిద్ర పోవాలి (నిద్ర లేమి సమస్యలను అధిగమించాలి)
రకరకాల కారణాల చేత నిద్ర పట్టకపోవడం సమస్య మొదలవుతుంది.
మనం ఆరోగ్యంగా ఉండటం కోసం అహారంతో పాటు నిద్ర కూడ అతి ముఖ్యమైనది, మనకు దేవుడు ఇచ్చిన వరాలలో నిద్ర ఒకటి, అయితే నిద్ర లేమి వలన అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
నిద్ర అలసిపోయిన వారికి మనసు బాగా లేనప్పుడు సంజీవని లాగ పనిచేస్తుంది
నిద్ర వలన కలిగే ఉపయోగాలు
శారీరిక శ్రమ చేసే వారిలో కొన్ని రకాల కణాలు ఖర్చు అవుతూ ఉంటాయి.
ఎక్కువగా నిద్రపోవడం వలన, మనం నిద్రపోయినప్పుడు శరీరంలో ఆ కణాలు మళ్ళీ తయారు అవుతాయి, అయితే మనం నిద్రపోయినప్పుడు శరీరంలో రక్త ప్రసరణ నెమ్మదిగా జరగటం గుండె వేగం తగ్గటం ఊపిరి తీసుకునే స్థాయి కూడ తగ్గుతుంది, నిద్ర పోవడం అంటే మన శరీరానికి అవసరమైన విశ్రాంతి దొరకడం, ఇలా విశ్రాంతి తీసుకోవడం వలన మనం లేచిన తరువాత మన శరీరం చూరుకుగా మళ్ళి పనులు చేయడానికి సహాయపడుతుంది.
- శారీరిక శ్రమ లేని వారు కొంచెం తక్కువ నిద్ర పోయిన సరిపోతుంది.
- నిద్రలేమి సమస్య ఉన్నవారు పడుకునే ముందు పాలు తాగి పాడుకోవడం వలన హాయిగా నిద్రపడుతుంది.
- రోజూ సాయంత్రం స్నానం చేయడం వలన చక్కగా నిద్రపడుతుంది.
- రోజు ఆహారంలో బాగంగా అరటి పండు తినడం వలన చక్కగా నిద్రపోతారు.
- మనం నిద్ర పోయె గది ప్రశాంతంగా ఉండాలి.
- సాదారణంగా పనిచేసే వారు 6-8 గంటలు నిద్రపోవాలి.
- ఇప్పుడే పుట్టిన పిల్లలు అయితే 16-20 గంటల వరకు నిద్రపోవాలి.
- స్కూల్ కి వెళ్లె పిల్లలు 11-12 గంటలు నిద్రపోవాలి.
- యువత 9 గంటల వరకు నిద్రపోతె సరిపోతుంది.
- వృద్దులకు ఎక్కువ నిద్రపట్టదు.
నిద్ర రాకపోవడానికి కారణాలు
- మానసిక సమస్య ఉన్నవారికి నిద్ర సరిగా పట్టదు.
- కొంత మందిలో అనారోగ్య సమస్య ఉన్నవారికి, వారు వాడె మందుల ప్రభావం వలన నిద్రలేమి సమస్య మొదలవుతుంది.
- మనసులో ఎక్కువ ఆలోచనలు ఉండటం వలన కూడ నిద్ర లేమి సమస్య ఉంటుంది.
- ఆహారం సరిగా తీసుకోకపోవడం మరియు ఆలస్యంగా తీసుకోవడం వంటి వాటి వలన సరిగా నిద్రపట్టదు.
- Cell phones, computers, laptop వంటివి విరామం లేకుండ వాడటం వలన నిద్రలేమి సమస్య ఉంటుంది
7. ఉదయం పూట సూర్యరశ్మిని పొందాలి
మన శరీరానికి సరిపడ vitamin “D” అవసరం, విటమిన్ ” డి ” శరీరానికి కావలిసినంత ఉండాలి. ఈ విటమిన్ D ని మనం ఆహార పదార్థాల్లో కూడా తీస్కోవచ్చు.
ఎండ నుంచి వచ్చే విటమిన్ “D” ని Sunshine Vitamin అని కూడా అంటారు
విటమిన్ డి లోపం వలన కలిగే సమస్యలు
మన శరీరానికి విటమిన్ “డి” సరిపడ లేకపోతే బలహీనత, తీవ్ర అలసట, ఎముకల నొప్పి మరియు ఎముకలు విరగటం, పగుళ్లు రావటం వంటి లక్షణాలు గమనించవచ్చు
- పిల్లల్లో rickets వ్యాది మరియు పెద్దలలో కీళ్ల వాపు వస్తుంది. విటమిన్ డి లోపం వలన రక్తంలో Glucose ఖర్చు కాకపోవడం వలన diabetic వస్తుంది, దీని వలన ఆకలి ఉండదు.
- విటమిన్ D లోపంతో తలనొప్పి వచ్చే అవకాశం కూడా ఉంది, ఈ సమస్య పురుషులలో ఆదికంగా కనిపిస్తుంది, శరీరానికి ఎండ తగలక పోవడం ఈ సమస్యకి కారణం అని నిపుణులు అంటున్నారు.
- గుండె మరియు ఊపిరితిత్తులు ఉండే ఎముకల భాగాలలో నొప్పిగా ఉండటం క్షణక్షణానికి భావోద్వేగాలు మారటం, వాతావరణం చల్లాగ ఉన్నప్పటికి చేమట రావటం వంటివి అన్ని "D" vitamin లోపాలు.
సూర్య రశ్మి పొందటం మరియు ఉపయోగాలు
సూర్యరశ్మి కోసం ఎండలో కూర్చునే ముందు శరీరానికి కొంచెం కొబ్బరి నూనె రాసుకోవడం వలన సూర్యకిరణాలు చర్మం పైన పడి ఆ తరువాత విటమిన్ D వస్తుంది. దీని వలన సూర్యరశ్మి శరీరంలో ప్రతి కణానికి చేరడం జరుగుతుంది, కణాలు చైతన్య వంతంగా అవుతాయి. ఆరోగ్యాంగా ఉండటానికి సహయపడుతుంది.
సూర్యకిరణాల ప్రభావం వలన శరీరంలో కొన్ని హార్మోనుల ప్రభావం వలన కొన్ని రకాల మార్పులు జరుగుతాయి, ఈ కిరణాల వలన serotonin అనే హార్మోను ఉత్పత్తి అవుతుంది.
అలా ఉత్పత్తి అయిన హార్మోను మానసిక ప్రశాంతతని ఇస్తుంది మరియు ఏకాగ్రత ఉండటానికి సహయపడుతుంది. తగినంత సూర్యరశ్మి శరీరానికి రాకపోతే serotonin స్థాయి తగ్గి నీరసం ఒత్తిడి మరియు అలసట వస్తాయి.
ఆహార పదార్థాలలో విటమిన్ డి
పదార్థం | Quantity | Calories |
---|---|---|
Salmon fish | 100g | 17.9micrograms |
Tuna fish | 100g | 6.7mc |
Cod liver oil | 1spoon | 11.3mc |
Mushroom | Half cup | 13.1mc |
Milk | 1cup | 1.3mc |
Orange | 1cup | 1.0mc |
8. Mobile Phone వినియోగం తగ్గించాలి
మనం రోజూవారి పనులలో బాగంగా మొబైల్ ఫోన్ వాడుతూ ఉంటాము, అయితే ఈ phone వాడటం వలన అదికంగా ఆరోగ్య సమస్యలు ఉంటాయి.
మనం రోజు వాడే Cell Phoneని చరవాణి అంటారు.
Phone లో ఉండే తరంగాల వలన మెదడు లోపల ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. అనవసరంగా Phone అధికంగా వాడితే సమయం వృధా అవడంతో పాటు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.
ఫోన్ వాడటం వలన వచ్చే మెడల నొప్పి మరియు మెడలలో నరాలు అరుగడం వంటి సమస్యలు వస్తాయి.
Phone మెదడు కి సాధ్యం అయినంత దూరంగా ఉంచటం మంచిది. మెదడులో వచ్చే cancer, phone అదికంగా వాడటం, చెవి దగ్గర పెట్టి వాడటం వలన వస్తుంది.
Mobile Phone వాడటం వలన వచ్చే అనర్థాలు
- అధికంగా phone వాడటం వలన కంటి జబ్బులు, గుండె జబ్బు వచ్చే అవకాశం ఉంది.
- పిల్లలు అధికంగా Phone వాడటం వలన, చిన్న వయసులోనే మెదడులో కంతి(గడ్డలు) అయ్యె అవకాశం తో పాటు మెల్లకన్ను వచ్చే అవకాశం కూడా ఉంటుంది.
- phone విరామం లేకుండ 5-6 గంటలు చూడటం వలన కళ్లు పొడిభారడం వంటి సమస్యలు వస్తాయి.
- కళ్లు మంట దురదగా ఉండటం, కళ్లలో ఎదో ఉన్నట్టు ఉండటం, ఇలా ఉంటే dry eye సమస్య ఉన్నట్టే.
జాగ్రతలు
- స్మార్ట్ phone వరుసగ 30 నిమిషాలు కంటె ఎక్కువ సమయం వాడరాడు.
- కళ్ళకి phone కి 15cm దూరం ఉండేలా చూసుకోవాలి. Phone వాడేటప్పుడు, దీర్ఘంగా అలాగే phone చూస్తూ ఉండకూడదు, కనురెప్పలు కొడుతూ ఉండాలి, ఇలా చేయడం వలన కన్ను పొడిబారాకుండ కాపాడుతుంది.
- computer, phone మరియు laptop వాడేవారు eye drops వేసుకోవలి, ఆలాగే computer కి anti reflective glass వాడలి.
- పొడిబారిన కళ్ల సమస్య వున్నవారు కృత్రిమ కంటి నీరుని ఛాలా రోజుల వరకు వాడలి.
- computer, laptop మరియు phone వాడె వారు 20 నిమిషాలు వాడిన తరువత కొద్ది సేపు విరామం తీసుకొని, 20feet దూరంలో ఉండే వస్తువుని 20 seconds పాటు చూడాలి. ఇలా చేయడం వలన కళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా చేస్తుంది.
- Phone లో font size పెద్దగా లేద mediumగా పెట్టుకోవడం వలన కళ్ళకి ఎటువంటి సమస్య ఉండదు.
9. Dry Fruits ని ఎక్కువగా తీసుకోవాలి
మన శరీరానికి అవసరమైన శక్తిని ఇచ్చేవి Dry fruits, అన్నిరకాల పోషకాలు ఈ dry fruits లో ఉంటాయి, వీటిలో ఉండె ఖనిజలవణాలు Enzymes స్రవించడానికి ఉపయోగపడుతాయి.
Dry fruitsలో శక్తివంతమైన antioxidants, మరియు ప్లవనయిడ్స్ శరీరంలో వృద్ధి చెందే cancer కణాలు వృద్ధి చెందకుండ చేస్తాయి, అంతేకాకుండ cancerకి కారణం అయ్యె freeradicals బారిన పడకుండా శరీరాన్ని కాపాడుతాయి.
Dry fruits తినడం వలన వాటిలో ఉండే కేరోటినాయిడ్స్ మరియు విటమిన్ A కంటి చూపుని చురుకుగా ఉండటానికి కంటి ఆరోగ్యాన్ని బాగు చేస్తాయి, కంటి సమస్యలను తగ్గిస్తాయి
Dry fruits లో fiber అధికంగా ఉండటం వలన అజీర్తిని నివారణించి జీర్ణ క్రియని పెంచుతాయి
Dry fruits రోజూ తినడం వలన శరీరానికి కొవ్వుని balance చేయడానికి సహాయపడుతాయి. వీటిలో పుష్కలంగా ఉండే fatty ఆమ్లాలు శరీరంలోని కొవ్వుని తగ్గించడంలో చక్కగా పని చేస్తాయి.
Dry fruits అంటే ఎండిన పండ్లు. పచ్చి పండ్లు తినడం కన్న ఎండిన పండ్లు తినడం వలన ఎక్కువ పోషకలు అందుతాయి.
ఎండు ద్రాక్ష
- ఎండు ద్రాక్షలలో పొటాషియం, విటమిన్ c, iron వంటి పోషకలు ఉంటాయి.
- ఎండు ద్రాక్ష తినడం వలన మూత్ర పిండాలు, పేగు, మూత్రాశయం పని తీరుని మెరుగు పరచడానికి ఉపయోగపడుతాయి.
- దంత సమస్యలు చిగుళ్ల వ్యాది తగ్గడంతో పాటు కాలేయమం పని తీరుకి సహయ పడుతాయి.
- ఎండు ద్రాక్షలలో ఉండె iron వలన అధికంగా రక్త హీనత తగ్గడంతో పాటు రోగ నిరోదక శక్తి పెరగటానికి సహయపడుతుంది.
- ఎండు ద్రాక్షలు రోజూ తినడం వలన Bp ,షుగర్ ఆదుపులో ఉంటాయి.
- మెదడు పని తీరునీ బాగు చేసి జ్ఞాపకశక్తి, ఏకాగ్రత ఉండటానికి సహాయపడుతాయి.
- మలబద్దకం డయెరియను నివారిస్తుంది. మంచి bacteria పెరగటానికి ఉపయోగపడుతుంది.
Anjira (అంజీర )
- Anjiraలో పొటాషియం ఆదికంగా ఉంటుంది. అధిక రక్త పోటుతో భాద పడేవారు anjira తింటే రక్త పోటు అదుపులో ఉండటానికి పని చేస్తుంది.
- anjira లో ఉండే calcium, iron, పొటాషియం, Magnesium ఖనిజ లవనాలు కొన్ని రకాల వ్యాదులను నివారిస్తాయి.
- శరీరానికి వేడిని తగ్గించడానికి, anjira చక్కగా పని చేస్తుంది.
- రక్తంలో హీమోగ్లోభిన్ స్తాయిని పెంచి రక్త హీనతను నివారించడానికి సహయ పడుతుంది. Anjiraను salads, oats తో కలిపి తినడం వలన ఎక్కువ బలాన్ని పొందగలం.
- kidneyలో రాళ్లు కరగటానికీ anjira చక్కగా ఉపయోగపడుతుంది.
ఆప్రికాట్
- ఆప్రికాట్ తినడం వలన అనేక ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి.
- శరీరానికి ఉపయోగపడే విటమిన్స్ మరియు మినిరల్స్ వీటిలో ఉంటాయి.
- ఆప్రికాట్ తినడం వలన జీర్ణ సమస్యలు పోతాయి, మలబద్దకం సమస్య తగ్గించి గుండె జబ్బులు లేకుండ చేస్తాయి.
- బరువు తగ్గడానికి కూడ ఉపయోగపడుతుంది .
ఖర్జూర
- ఖర్జూర రోజూ తినడం వలన బరువు తగ్గటానికి ఉపయోగపడుతుంది.
- ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేని వారు ఒక రోజుకి 10 వరకు ఖర్జూరలు తినడం మంచిది.
- ఈ ఖర్జూరని పల్లీలు లేదా నువ్వులతో కలిపి ముద్దలు చేసుకొని రోజూ ఒకటి తినడం వలన రక్త హీనత ఉండదు ఆరోగ్యానీకి ఛాలా మంచిది.
- ఎండు ఖర్జూరలను ఎండలో పెట్టి తరువత పొడి చేసి చెక్కరల వాడుకోవడం వలన ఆరోగ్యానికి చాల మంచిది. Juicesలో saladsలో ఈ పొడి వేసుకుని తాగితే ఆరోగ్యానీకి చాల మంచిగా ఉపయోగపడుతుంది.
Published by
Health Tips telugu
healthtipstelugu.in is the best resource for quality health tips in Telugu. Our website provides visitors with an easy way to find the best health tips for staying healthy and fit. We provide reliable health information in an easy-to-understand format, so you can make the most of your health.
Health Tips Telugu is founded and maintained by a group of medical professionals and health enthusiasts passionate about providing accurate, up-to-date health information to Telugu speakers around the world. We follow strict editorial practices to provide only truthful, unbiased health guidance that readers can rely on. We reference reputable health organizations, academic medical centers and peer-reviewed journals when developing our articles.