సర్వైకల్ క్యాన్సర్ అనేది మహిళల్లో సర్వైక్స్లో వచ్చే ఒక రకమైన క్యాన్సర్. సర్వైక్స్ అనేది గర్భాశయానికి యోనిని కలిపే భాగం. ఈ భాగంలోని కణాలు అసాధారణంగా పెరిగి, నియంత్రణ కోల్పోయి క్యాన్సర్ కణాలుగా మారడం వల్ల ఈ వ్యాధి వస్తుంది.
అయితే సర్వైకల్ కాన్సర్ అందరికీ అవగాహన కల్పించడం ముఖ్యం.
కావున దీని గురించి అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.
Cervical Cancer ప్రపంచాన్ని పట్టి పిడుస్తున్న మహమ్మారి ఈ కాన్సర్ బారిన పడకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటే తప్ప Cervical Cancer బారిన పడకుండా ఉండగలం. Cervical Cancer బారిన పడకుండా స్త్రీలు ఎక్కువగా జాగ్రత్తలు తీస్కోవడం మంచిది.
ఈ కాన్సర్ లను మొదటి దశలో గుర్తిస్తే Cancer నుండి బయట పడటానికి సులువుగా ఉంటుంది
సాదారణంగా సర్వైకల్ కాన్సర్ HPV వైరస్ వలన వస్తుంది. ఈ వ్యాది సోకిన తరువాత బయట పడటానికి 10-25 సంవత్సరాల సమయం పడుతుంది, కానీ రోగనిరోదక శక్తి తక్కువగా ఉండే వారిలో ఈ వ్యాది కేవలం 5-10 సంవత్సారాలా కాలంలోనే బయట పడుతుంది. కావున మహిళలు గమనించవల్సిన ముఖ్య విషయం ఏమిటంటే, మహిళలు ఎటువంటి అనారోగ్య సమస్యలకు గురి అవ్వకుండా ఉండటం మరియు పూర్తిగా పోషక ఆహారాన్ని తీసుకోవడం రోగ నిరోదక శక్తిని పెంచుకోవడం వంటివి చేస్తే గర్బశయ కాన్సర్ వంటి మహమ్మారి బారిన పడకుండా ఉండవచ్చు.
సర్వైకల్ కాన్సర్ ఎలా స్టార్ట్ అవుతుంది – Cervical Cancer in Telugu
గర్బశయ ముఖ ద్వారం వద్ద కొన్ని రకాల కణాలలో వాటి DNA తో మార్పు చెందినప్పుడు గర్బశయ కాన్సర్ వస్తుంది. ఈ సమయంలో కొంతవరకు కణాలు పెరగటం మరియు చనిపోవటం జరుగుతుంది, అలా చనిపోయిన కణాలు పేరుకుపోయి కాన్సర్ కణాలకు సమీపంలో ఉన్న కణజాలం పైన దాడి చేస్తాయి, ఆ కణితి నుండి విడిపోయి ఇతర కణాలు కనలకు వ్యాప్తి చెందుతుంది వ్యాది తీవ్రతను పెంచుతాయి.
సర్వైకల్ క్యాన్సర్‌కు ప్రధాన కారణం హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV) అనే లైంగిక సంక్రమణ వ్యాధి. ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశించి సర్వైక్స్ కణాలను దెబ్బతీస్తుంది. అయితే, అన్ని రకాల HPV వైరస్‌లు క్యాన్సర్‌కు దారితీయవు. కొన్ని ప్రత్యేక రకాల HPV వైరస్‌లు మాత్రమే క్యాన్సర్‌కు ప్రమాదకరంగా ఉంటాయి.
ఇతర ప్రమాద కారకాలు మరియు లక్షణాలు:
- పొగతాగే మహిళలు
- ఎక్కువ మంది లైంగిక భాగస్వాములు ఉండటం.
- తక్కువ రోగనిరోధక శక్తి ఉన్న మహిళలు
- దీర్ఘకాలికంగా జననేంద్రియ ఇన్ఫెక్షన్లు ఉన్న మహిళలు
- కడుపులో నొప్పి, అలసట.
గమనిక: ఈ సమాచారం వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు. ఏవైరైనా ఆందోళనలు ఉంటే వైద్యులను సంప్రదించండి.
సర్వైకల్ కాన్సర్ ని నివారించడం ఎలా:
- సర్వైకల్ క్యాన్సర్‌కు ప్రధాన కారణం HPV వైరస్.
- అన్ని రకాల HPV వైరస్‌లు క్యాన్సర్‌కు దారితీయవు.
- పొగతాడే మహిళలు, ఎక్కువ మంది లైంగిక భాగస్వాములు ఉన్న మహిళలు, రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న మహిళలు, దీర్ఘకాలికంగా జననేంద్రియ ఇన్ఫెక్షన్లు ఉన్న మహిళలకు ప్రమాదం ఎక్కువ.
సర్వైకల్ కాన్సర్ రాకుండా ఉండటానికి వ్యాక్సిన్ తీస్కోవడం ఉత్తమమైన మార్గం సర్వరిక్స్ లేదా Gardasil అనే వ్యాక్సిన్ ని సర్వైకల్ కాన్సర్ రాకుండా ఉండటానికి వేసుకోవచ్చు.
గర్బశయ కాన్సర్ అనేది ఒక పెద్ద మహమ్మారి అయినప్పటికీ మనం సరైన జాగ్రత్తలు తీస్కొని, మనోదైర్యంతో ఉంటే ఎటువంటి వ్యాదిని అయిన జయించవచ్చు.
గర్భాశయ క్యాన్సర్ గురించి తరచుగా అడుగుతున్న ప్రశ్నలు (FAQs)
గర్భాశయ క్యాన్సర్ అంటే ఏమిటి?
గర్భాశయ కణాల అసాధారణమైన పెరుగుదలే గర్భాశయ క్యాన్సర్. చాలా సందర్భాలలో ఇది హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV) అనే లైంగిక సంక్రమణ వైరస్ వల్ల వస్తుంది.
గర్భాశయ క్యాన్సర్‌కు కారణాలు ఏమిటి?
HPV వైరస్: చాలా సర్వైకల్ క్యాన్సర్లకు ముఖ్య కారణం.
ధూమపానం: ధూమపానం సర్వైకల్ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది.
అనేక సంతానాలు కలిగి ఉండడం: ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉన్న మహిళలకు ప్రమాదం ఎక్కువ.
గర్భాశయ క్యాన్సర్ చికిత్స ఉందా?
అవును, క్యాన్సర్ ఎంత ప్రారంభదశలో ఉందో దాని ఆధారంగా వివిధ చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. సాధారణ చికిత్సలలో శస్త్రచికిత్స, రేడియేషన్ మరియు కీమోథెరపీ ఉన్నాయి.
Health Tips Telugu is founded and maintained by a group of medical professionals and health enthusiasts passionate about providing accurate, up-to-date health information to Telugu speakers around the world. We follow strict editorial practices to provide only truthful, unbiased health guidance that readers can rely on. We reference reputable health organizations, academic medical centers and peer-reviewed journals when developing our articles.