flax seeds in telugu

అవిసె గింజల వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు-Flax Seeds in Telugu

avise ginjalu uses in telugu

Share :

Table of Contents

Facebook
WhatsApp
Twitter
LinkedIn

Flax seeds meaning in telugu

Flax seeds ని తెలుగులో అవిసె గింజలు లేదా అగిసె గింజలు” అని అంటారు 

అవిసెలతో ఆరోగ్యం - flax seeds uses in telugu

అవిసె గింజలు మన శరీరానికి ఒక ఔషధంలాగా పనిచేస్తాయి. అనేక రకాల ఉపయోగాలు ఉన్న ఈ flax seeds వలన ఎలాంటి రుగ్మతలు రాకుండా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. బరువు తగ్గడానికి కూడా అవిసె గింజలు ఉపయోగపడుతాయి.

ఎక్కడ అయితే అవిసె గింజలు తింటారో అక్కడ ఆరోగ్యం వెల్లువిరుస్తుంది అని మన పెద్దలు అంటూ ఉంటారు. అవిసె గింజలు మాత్రమే కాకుండా అవిసె చెట్టు ఆకు వాడటం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి

50% off : అతి తక్కువ ధరకి అవిసె గింజలు Amazon లో Order చేస్కోండి

అవిసె గింజలు తినండి ఆరోగ్యంగా జీవించండి

కింద ఉన్న link క్లిక్ చేసి Discount పొందండి 

Flax Seeds Price : ₹ 329

Health Benefits of flax seeds in telugu

అవిసె గింజల ప్రయోజనాలు: avise ginjalu uses in telugu

Source : Quora

6 Fantastic Beauty Benefits of Flax Seeds | SUGAR Cosmetics

అవిసె చెట్టు ప్రాముఖ్యత

ఈ అవిసె చెట్టుకి సహజంగా కొన్ని పేర్లు కలవు. సంస్కృతంలో క్షుమ అనే చక్కటి పేరు కలదు.

 

flax seeds in telugu

అవిసెలకు గల పేర్లు

ఆంగ్లంలో linseed plant అని అంటారు, ఈ linseed గింజలను flaxseed అని అంటారు. linseed నుంచి వచ్చే oil ని పెయింట్స్ వేయడానికి వాడుతారు.

అవిసె నూనె ఉపయోగాలు - avisa oil uses in telugu

అవిసె గింజల నూనెలో ఒమేగా 3 fatty acids ఉంటాయి, వాటితో  పాటు అధిక మొత్తంలో పోషక విలువలు ఉంటాయి. 
ఈ అవిసె గింజల నూనెను షుగర్ వ్యాది మరియు కీళ్ల నొప్పులు అదుపులో ఉండటానికి సహకరిస్తుంది.

 

  • అవిసె గింజల నూనెలో అధికంగా ఫైబర్ ఉండటం వలన జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మరియు కాన్సర్ వ్యాదిని నివారించడానికి అవిసె నూనె ఉపయోగపడుతుంది.

     

  •   చర్మ సౌందర్యానికి మరియు చర్మం ముడతలు లేకుండా అందంగా ఉండటానికి అవిసె నూనెలో ఉండే పోషకాలు సహకరిస్తాయి.

50% off : అతి తక్కువ ధరకి అవిసె గింజలు Amazon లో Order చేస్కోండి

అవిసె గింజలు తినండి ఆరోగ్యంగా జీవించండి

కింద ఉన్న link క్లిక్ చేసి Discount పొందండి 

Flax Seeds Price : ₹ 329

అవిసె పువ్వుల ఉపయోగాలు - avisa puvvulu uses in telugu

అవిసె పువ్వులు తెల్లగాను ఎర్రగాను రెండు రకాలుగా ఉంటాయి, ఈ ఎరుపు రంగులో ఉండే అవిసె పువ్వును చూడగానే hammingbird గుర్తుకొస్తుంది అని అంటూ ఉంటారు, అయితే ఇంగ్షీషులో వెజిటబుల్ hammingbird అంటారు.

అవిసె గింజలలో  ఎలా అయితే అధిక పోషక విలువలు  ఉన్నాయో అలాగే అవిసె పువ్వు కూడా అలాగే  అనేకమైన పోషక విలువలు ఉంటాయి. అవిసె పువ్వులో proteins, minerals మరియు iron, calicums కూడా అధికంగానే ఉంటాయి.

అవిసె పువ్వు తినడం వలన జ్వరం రాకుండ నివారిస్తుంది, sinus, runnig nose సమస్యకి కూడా పరిష్కారం చూపుతుంది దీర్ఘకాలిక వ్యాదులను కూడా తగ్గిస్తుంది, కాన్సర్ వ్యాది ఉన్నవారు కూడా అవిసె పువ్వు వాడితే వ్యాది తగ్గే అవకాశం ఉంది, ఈ పువ్వుని నూరి rheumatism సమస్య ఉన్నవారు నొప్పి ఉన్న చోట రాయవచ్చు.  
 

అవిసె పువ్వుల కూర
అవిసె పువ్వులను తీసుకొని వాటి మద్యలో ఉండే తెల్లటి పొడవాటి వాటిని మరియు పువ్వు మొదట్లో ఉండే పచ్చటి కండాన్ని తీసివేయాలి ఇలా అవిసె పువ్వులను సుబ్రపరుచుకొని పక్కన పెట్టుకోవాలి,

ఆ తరువాత స్టౌ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి కొద్దిగా నూనె వేసి నూనె వేడెక్కిన తరువాత పోపు దినుసులు, కరివేపాకు, వెల్లుల్లి, శనపప్పు కొద్దిగా పోపులో వేసుకోవాలి ముందుగా శుబ్రం చేసుకొని పెట్టుకొన్న పువ్వులను కూడ అదే గిన్నెలో వేసుకొని బాగా కలుపుతు వేయించుకోవాలి ఇలా వేయించేటప్పుడు పువ్వు రంగు మారుతాయి కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి,

ఆ తరువాత దనియాల పొడి కారం పొడి ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి, చివరగా పల్లిలా పొడిని వేసుకొని బాగా కలుపుకోవాలి, అవిసె పువ్వుల కూర తయారయింది అన్నంతో పాటు తినవచ్చు.   

Benefits of Flax Seeds Telugu Video

అవిసెల ఉపయోగాలు - avisa seeds uses in telugu

flax-seeds-benefits-telugu---omega-3-uses
Source : Pinterest

అవిసె చెట్టు యొక్క ఆకుగాని, బెరడుకాని రసం చేసి తాగడం వలన వేడి చేస్తుంది, కానీ ఈ అవిసెలకు గల మహా ఔషద గుణం వలన కఫ రోగలు, క్రిమి రోగాలు తగ్గుతాయి. ఇంకా పైత్య జ్వరం, రక్త పైత్యం, సర్ప విషం వంటివి కూడ తగ్గుతాయి. శరీరంలో పేరుకున్న అదనపు కొవ్వు, అతి కొవ్వుని  తగ్గిస్తుంది. శరీరాన్ని నాజూకుగా తయారు చేస్తుంది, బరువు కూడా తగ్గుతారు. 
బరువు తగ్గడానికి తిప్ప తీగ కూడా ఉపయోగపడుతుంది.  

అవిసె గింజలు ఎలా తినాలి - how to eat flax seeds in telugu

అవిసె గింజలను మనకు అనుకూలమైన పద్దతిలో సులువుగా తినడానికి ఉత్తమమైన పద్దతి.

అవిసె గింజల కారంపొడి recipe - ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు!

ఒక కప్పు అవిసె గింజలను మరియు ఒక కప్పు నువ్వులను వేయించి, వేయించిన అవిసె గింజలను పొడి చేయాలి ఆ తరువాత వేయించిన నువ్వులను కూడా అందులో కలిపి పొడి చేయాలి, ఎండు మిర్చి, జీలకర్ర పోపు చేసి అందులో ఉప్పు వేసి పేస్ట్ చేసి అవిసె గింజలు మరియు నువ్వుల పొడిలో ఈ మిశ్రమాన్ని కలపాలి.  ఈ పొడిని రోజు అన్నం లో కానీ, టిఫిన్స్ లో కూడా తినవచ్చు.

అవిసె గింజల లడ్డూలు

Flax Seeds లోని పోషక విలువలు నేరుగా అందడానికి అవిసె గింజలతో లడ్డూలు చేసుకొని తినడం ఉత్తమమైన పద్దతి అని చెప్పవచ్చు. అవిసె గింజలు ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.
 
అవిసె గింజల లడ్డూలను తయారు చేయడానికి అవిసె గింజలను ఒక కప్పు తీసుకోవాలి, రెండు కప్పుల నువ్వులను తీసుకోవాలి, జీడి పప్పు 50 గ్రాములు, బాదం పప్పు 50గ్రాములు తీసుకోవాలి, 6 యాలకులు మరియు పావుకిలో బెల్లం తీసుకోవాలి.
 
అవిసె గింజల లడ్డూలు చేయడానికి ముందు ఒక గిన్నె స్టౌ మీద పెట్టి నువ్వులను ఆయిల్ వేయకుండా  వేయించుకోవాలి, ఆ తరువాత నువ్వులను వేరే గిన్నెలో వేసుకొని, అవిసె గింజలను ఆయిల్ వేయకుండా చిటపట అనే అంతా వరకు వేయించుకోవాలి, అలాగే స్టౌ మీద ఒక గిన్నె పెట్టి అందులో 2 స్పూన్స్ నెయ్యి వేసి జీడి పప్పు మరియు బాధం పప్పు కూడా వేయించుకోవాలి.

ఆ తరువాత వేయించుకున్న అన్నిటి యాలకులు వేసి మిక్సీ పట్టాలి, బెల్లం తురిమీ మిక్సీ లో వేయాలి అలా వేసిన తరువాత మళ్ళీ మిక్సీ పట్టి ఆ పొడిని ఒక గిన్నెలో తీసుకొని ముద్దలు గా చేసుకోవాలి.

ఈ లడ్డూలు రోజు ఒకటి తింటే ఆరోగ్యానికి చాలా మంచిది, చాపలు తినని వారు వీటినీ చక్కగా తినవచ్చు చాపలలో ఉండే ఒమేగా 3 fatty acids flaxseedsలో పుష్కలంగా ఉంటాయి. 
     

flax seeds in telugu

బరువు తగ్గడానికి అవిసె గింజలను వాడె పద్దతి !

బరువు తగ్గడానికి అవిసె గింజలు అత్యుత్తమ మార్గం అని చెప్పవచ్చు. అవిసె గింజలు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తాయి, కావున అవిసె గింజలను వాడటం వలన సులువుగా బరువు తగ్గుతారు.

1.బరువు తగ్గడం కోసం అవిసె గింజలను దోరగా వేయించి పొడి చేసి ఆ పొడిని వేడి నీటిలో కలుపుకొని చల్లారిన తరువాత కాస్త నిమ్మ రసం కలుపుకొని తాగాలి. ఇలా ఒక నెల రోజులు చేయడం వల్ల చాలా తొందరగా బరువు తగ్గుతారు.

2.Flax Seeds ని లడ్డూలుగా చేసుకొని రోజు తినడం కూడా ఆరోగ్యకరం మరియు బరువు తగ్గడానికి సహకరిస్తాయి.

ఈ అవిసె గింజల పొడిని మనం రోజూ తినే వంటలలో, చిరుతిల్లలో మరియు కూరలలో పైన చల్లుకుని తినొచ్చు, పెరుగుతో పాటు కలుపుకొని తాగొచ్చు, ఫ్రూట్ సలాడ్స్ తో కూడ తీసుకోవచ్చు.

షుగర్ వ్యాది ఉన్నవారు అవిసె గింజలను ఎలా తినాలి?

షుగర్ ఉన్నవారు అవిసె గింజలను తినడం చాలా మంచిది. వాటిలోని పోషకాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడతాయి. కానీ, వాటిని ఎలా తినాలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి:

  • పరిమితి: రోజుకు ఒక టీస్పూన్ కంటే ఎక్కువ తినకూడదు. ఎక్కువ తినడం వల్లన కడుపు ఉబ్బరం, అతిసారం వంటి సమస్యలు రావచ్చు.
  • నానబెట్టి తినండి: ఒక స్పూన్ అవిసె గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయం ఖాళీ కడుపుతో తినడం ఉత్తమం. ఇలా చేయడం వల్లన గింజల్లోని పోషకాలు బాగా శరీరానికి అందుతాయి.
  • పొడి చేసి: అవిసె గింజలను మిక్సీలో పొడి చేసి, రోజువారీ ఆహారంలో ఒక స్పూన్ లేదా అర స్పూన్ కలుపుకోవచ్చు. పెరుగులో, స్మూతీస్ లో, రొట్టె పిండిలో కలపోవచ్చు. చపాతీలు చేసేటప్పుడు కూడా కొద్దిగా పొడిని చేర్చవచ్చు.

గవద బిళ్ళలు పోవడానికి అవిసె చెట్టు రసం

పిల్లలో వచ్చే గవద బిల్లలు పోవడానికి అవిసె చెట్టు ఆకుని రసం చేసి పూస్తే త్వరగా మానిపోతాయి.

మలబద్దకం సమస్యకి అవిసె గింజల పరిష్కారం -flaxseed to relieve constipation

మలబద్దకం సమస్య ఉన్న వారు కూడా flax seeds వాడొచ్చు. అవిసె గింజలలో ఫైబర్ అదికంగా ఉంటుంది, ఈ ఫైబర్ జీర్ణాశయాన్ని శుద్ది చేసి మలబద్దకాన్ని నివారిస్తుంది.

కడుపులో నొప్పి, కడుపులో మంట మరియు అజీర్తి వంటి సమస్యలను తగ్గించడానికి  అవిసె గింజలలో ఉండే పోషకాలు ఉపయోగపడుతాయి.

Gastric సమస్యలును దూరం చేయడానికి సబ్జా గింజలు వాడటం మంచిది.

“సబ్జా గింజల ఉపయోగాలు తెలుసుకోండి” 

అవిసె గింజలతో గుండె జబ్బులను ఎలా నివారించాలి?

Flax Seeds ని తరుచుగా తీసుకోవడం వలన వీటిలోని ఒమేగా 3fatty acids మరియు anti inflammatory స్వభావం వలన గుండె కొట్టుకునే స్థాయి మెరుగు పడుతుంది.


Omega 3 fatty acids అవిసె గింజలలో ఉండటం వలన ఇవి రోజూ తీసుకోవడంతో రక్తనాళాల లోపల fat ఉండకుండా cholesterol పేరుకోకుండ ఉండటానికి, heart blocks రాకుండా ఉండటానికి వచ్చినా త్వరగా కరగటానికి మంచిగా ఈ అవిసె గింజలు పని చేస్తాయి.

ఈ omega 3 fatty acids అవిసె గింజలతో పాటు చియా విత్తనాలలో లభిస్తాయి.
walnutsలో కూడా omega 3 fatty acids అధికంగా ఉండే dry ఫ్రూట్స్ అని చెప్పవచ్చు.
“walnuts ఉపయోగాలను ఇక్కడ తెలుసుకోండి”   

అవిసె గింజలలో ఉండే పోషకలు - Nutrients in Flaxseeds in Telugu

flax seeds in telugu

100 mg అవిసె గింజలలో

Cancer జబ్బు తగ్గడానికి Flax Seeds ఏలా వాడలి?

flax seeds in telugu

జుట్టు సమస్యలకు అవిసె గింజల పనితీరు -flaxseeds benefits for hair in Telugu

కేశ సౌందర్యాన్ని కాపాడుకోవడం కోసం, జుట్టు నల్లగా, వోత్తుగా, పొడుగుగా, చుండ్రు లేకుండ ఉండటం కోసం flax seeds ఉపయోగపడతాయి.

అవిసె గింజలను మరిగే నీటిలో వేస్తే జిగట లాంటి పదార్థం వస్తుంది అది చల్లారిన తరువాత ఆ జిగట పదార్థం జుట్టుకి, తలకి పెట్టుకోవాలి, 30 నిమిషాలు తరువాత జుట్టును shampoతో శుబ్రపరుచుకోవాలి.  

చర్మ సౌందర్యం మెరుగు పరచడానికి flax seeds రోజు తినాలి

 చర్మ అందంగా ఉండటానికి అవిసె గింజలను ఆకు కూరలలో, కాయగూరలలో ఈ పొడిని చల్లుకుని అన్నంతో పాటు తినొచ్చు.
అవిసె పొడిని ఖర్జురాతో కలిపి ముద్దలుగా చేసుకుని రోజు ఒకటి తింటే మంచి ప్రయోజనం పొందవచ్చు.

అవిసె గింజలను cleansing, scrubbing, massaging, మరియు face packsగా కూడా ఉపయోగించవచ్చు. 

ఒక వంతు అవిసె గింజలను తీసుకుంటే నాలుగు వంతుల నీటిని పోసి బాగా మరిగించుకోవాలి, అలా మారిగించిన నీటిని అవిసె గింజలను వేరు చేసుకోవాలి ఆ మరిగిన నీరు జెల్ లాగా ఉంటుంది. ఈ జెల్ ని ఒక నెల రోజుల వరకు స్టోర్ చేసుకొని వాడుకోవచ్చు.

1.Cleansing
అవిసె గింజలను మరిగించగా వచ్చిన జెల్ ని తీసుకొని, 1 స్పూన్ జెల్ లో కొంచెం తేనె వేసి, దూది సహాయంతో ముఖం మొత్తం రాయాలి, ఇలా చేస్తే అవిసె గింజల జెల్ cleanser లాగా పని చేసి, ముఖం పైన ఉన్న మురికిని తీసేసి ముఖం నీటిగా తయారవుతుంది.

2.Scrubbing 
అవిసె గింజల జెల్ ని 1 స్పూన్ తీసుకొని అందులో అవిసె గింజలను పొడి చేసి, ఆ పొడిని 1స్పూన్ వరకు తీసుకొని అందులో బియ్యం పిండిని కూడా కలిపి ముఖానికి scrubber లాగా 5 నిమిషాల పాటు స్క్రబ్ చేయాలి, చర్మం పైన ఉండే నలుపును, pigmentationని పోగొడుతుంది. ఈ స్క్రబ్ ని  మెడకు కూడా చేసుకోవచ్చు. 

3.Massage
ఒక స్పూన్ అవిసె గింజల జెల్ లో కొద్దిగా గ్లిసరిన్ మరియు విటమిన్ E ని వేసి బాగా కలిపి face కి మసాజ్ లాగా చేసుకోవాలి ఇలా చేయడం వలన ఈ జెల్ మన స్కిన్ లోపలికి వెళ్ళి స్కిన్ ని moisturized గా ఉంచుతుంది. మరియు హెల్తీ గా కూడా ఉంచుతుంది, డ్రై స్కిన్ వాళ్ళకి ఇది మంచి ఫలితాన్ని ఇస్తుంది.

4.Facepack
అవిసె గింజల face pack కోసం 1 స్పూన్ జెల్ ని తీసుకొని అందులో కొద్దిగా పసుపు మరియు శనగ పిండిని వేసి బాగా కలిపి ముఖానికి మెడకు రాసుకోని 15 నిమిషాల తరువుతా కడగాలి, ఇలా చేయడం వలన చర్మం కాంతి వంతంగా కనిపిస్తుంది. 

అవిసె గింజల అధికంగా ఎందుకు వాడకూడదు ?

Flax Seeds అధిక మోతాదులో తీసుకోవడం వలన అనేక దుష్ప్రభావాలు ఉన్నాయి.

ఆరోగ్యాన్ని కలిగించే పదార్థాలు కొన్ని శరీరంలో అనారోగ్యాన్ని కూడ కలుగ చేస్తాయి.

ఈ అవిసె గింజలలో ఓమెగా 3 fatty acids ఉండటం వలన అవి అధికంగా తీసుకోవడం వలన వీటిలో ఉండే fiber ఆకలిని తగ్గించి తక్కువ ఆహారం తీసుకునేలా చేస్తుంది.

ఈ ఓమెగా 3 fatty acids ఉండడం వలన అనేక జీర్ణ సమస్యలకు కారణం అవుతుంది అనేది పరిశోధకుల మాట.

ఈ అవిసె గింజలలో అధికంగా Fiber ఉండటం వలన పొట్టకి సంబంధించిన బాధలు ఎక్కువ అవ్వవచ్చు. bloating, gas, constipation మరియు డయేరియా వంటి సమస్యలు తలెత్తుతాయి.

ఈ అవిసె గింజలలో పీచు ఎక్కువ ఉండటం వలన జీర్ణo అవ్వడానికి ఇబ్బంది అవుతుంది. 

అవిసె గింజలను ఎవరు వాడకూడదు?

Frequently Asked Questions about Flax Seeds in Telugu

అవిసె గింజలు బరువు తగ్గడానికి ఉపయోగపడుతాయి. అవిసె గింజలలో fiber ఎక్కువగా ఉండటం వలన ఇవి రోజు తీసుకుంటే ఎక్కువగా ఆకలి వేయదు.

అవిసె గింజలను వేడి చేయకుండా పచ్చివి తినరాదు అలా తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. 

అవిసె గింజలను ఖాళీ కడుపుతో తినవచ్చు ఇది ఎక్కువగా తీసుకుంటే ఉబ్బరం, గ్యాస్, పొత్తికడుపు నొప్పి, మలబద్ధకం, అతిసారం, కడుపునొప్పి మరియు వికారం వంటి జీర్ణశయాంతర దుష్ప్రభావాలకు కూడా కారణం కావచ్చు. ఇలా జరగకుండా ఉండాలంటే అవిసె గింజలను పుష్కలంగా నీటితో తీసుకోవాలి.

అవిసె గింజలను ఖాళీ కడుపుతో తినవచ్చు ఇది ఎక్కువగా తీసుకుంటే ఉబ్బరం, గ్యాస్, పొత్తికడుపు నొప్పి, మలబద్ధకం, అతిసారం, కడుపునొప్పి మరియు వికారం వంటి జీర్ణశయాంతర దుష్ప్రభావాలకు కూడా కారణం కావచ్చు. ఇలా జరగకుండా ఉండాలంటే అవిసె గింజలను పుష్కలంగా నీటితో తీసుకోవాలి.

బరువు తగ్గడం కోసం అవిసె గింజల  పొడిని వేడి నీటిలో కలుపుకొని  తరువాత తాగాలి. ఈ పొడిని మనం రోజూ తినే వంటలలో కూరలలో పైన చల్లుకుని తినొచ్చు, పెరుగుతో పాటు కలుపుకొని తాగొచ్చు, ఫ్రూట్ సలాడ్స్ తో కూడ తీసుకోవచ్చు.

50% off : అతి తక్కువ ధరకి అవిసె గింజలు Amazon లో Order చేస్కోండి

అవిసె గింజలు తినండి ఆరోగ్యంగా జీవించండి

కింద ఉన్న link క్లిక్ చేసి Discount పొందండి 

Flax Seeds Price : ₹ 329

Article Reference Sites

Youtube.com
Quora.com
Pinterest.com

Disclaimer: This post may include affliate links. lf you click one of them, we may receive a cute
commission at no extra cost to you. Thank you.

Published by

Health Tips telugu

Health Tips telugu

healthtipstelugu.in is the best resource for quality health tips in Telugu. Our website provides visitors with an easy way to find the best health tips for staying healthy and fit. We provide reliable health information in an easy-to-understand format, so you can make the most of your health.

4.8/5 - (117 votes)