న్యాచురల్ గా పింపల్స్ తొలగించడం ఎలా

Pimples పోవడానికి అనేక రకాల చిట్కాలు పాటిస్తూ ఉంటాము, కానీ ఆశించిన ఫలితం రాక నిరాశకు చెందుతాము. మొటిమలను దూరం చేసి అద్బుతమైన ఫలితాన్ని ఇచ్చే చక్కటి చిట్కాలను  ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం! 

ఈ రోజుల్లో టీనేజ్ నుండి మొదలు అందరిలో ఉండే సమస్య మొటిమలు. మొటిమలు ఎలా పోగొట్టలో అర్దం కాక వివిద ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. మొటిమలు ఈ రోజుల్లో అందరికీ అతి పెద్ద సమస్య ఈ సమస్యను అదిగమించడానికి కొన్ని స్టెప్స్ follow అవడం మంచిది.

1. గ్రీన్ టీ:

చల్లబడిన కప్పు గ్రీన్ టీని ఫేస్ వాష్‌గా ఉపయోగించండి లేదా ప్రభావిత ప్రాంతంపై గ్రీన్ టీ బ్యాగ్‌ని ఉంచండి.

2. తేనె:
ప్రభావిత ప్రాంతాలకు ఒక టీస్పూన్ తేనెను అప్లై చేయండి లేదా 1/2 కప్పు తేనెను 1 కప్పు సాదా వోట్మీల్‌తో కలిపి 30 నిమిషాల పాటు ఫేస్ మాస్క్ లాగా వేసుకోండి

3. పుదీనా:
2 టేబుల్‌స్పూన్‌ల సన్నగా తరిగిన తాజా పుదీనాని రెండు టేబుల్‌స్పూన్‌ల సాదా పెరుగు మరియు వోట్‌మీల్‌తో కలపండి (ఓట్‌మీల్‌ను పొడిగా చేయడానికి బ్లెండర్ ఉపయోగించండి). మిశ్రమాన్ని మీ ముఖంపై 10 నిమిషాలు ఉంచి, ఆపై నీటితో శుభ్రం చేసుకోండి.

4. టూత్‌పేస్ట్:
పడుకునే ముందు తెల్లటి టూత్‌పేస్ట్‌ను ప్రభావిత ప్రాంతంపై కొద్దిగా రాయండి. టూత్‌పేస్ట్ వాపును తగ్గిస్తుంది మరియు మొటిమలను పొడిగా చేస్తుంది. ఒకటి లేదా రెండు రోజుల్లో, మీరు గణనీయమైన మెరుగుదలని చూడగలరు.

5. నిమ్మరసం:
ప్రభావిత ప్రాంతంపై నిమ్మకాయ ముక్కను రుద్దండి మరియు మీ ముఖాన్ని నీటితో శుభ్రం చేయడానికి ముందు కొన్ని గంటల పాటు వదిలివేయండి.

6. యాపిల్ సైడర్ వెనిగర్:
ఆపిల్ సైడర్ వెనిగర్ మరియు నీటిని సమాన భాగాలుగా కలపండి మరియు దూదితో చర్మానికి వర్తించండి, ప్రతి సారీ ఉపయోగించే ముందు బాగా షేక్ చేయండి.

How To Remove Pimple Marks 12 Effective Ways | Femina.in

కేవలం ఒక రోజులోనే మొటిమలు మాయం - overnight pimple removal tips in telugu

ఒక్క రోజులోనే మొటిమలను మాయం చేసే చక్కటీ చిట్కా!  

సహజంగా కొన్ని రకాల మొటిమలు నొప్పిని కూడా కలుగ చేస్తాయి. మొటిమల వలన వచ్చే నొప్పి నుండి మరియు మొటిమల నుండి విముక్తి పొందడానికి చక్కటి  చిట్కా. 

మొటిమలను కేవలం ఒక్క రోజులోనే నియంత్రించడానికి colgate toothpaste చక్కగా తీసుకోవాలి. ఈ కోల్గేట్ టూత్ పేస్ట్ ని రాత్రి పడుకునే ముందు మొటిమలు ఉన్నచోట పెట్టాలి, మొటిమలు ఉన్న చోట మాత్రమే పెట్టాలి, ఉదయం లేవగానే చల్లటి నీటితో కడగాలి. ఇలా పెట్టిన వెంటనే చక్కటి ఉపశమనం పొందటమే కాకుండా pimples కూడా తొలగిపోతాయి.

మొటిమలు తగ్గాలంటే ఏం చేయాలి?

  1. మొటిమలు తగ్గాలి అంటే మొటిమలను గిళ్ళకూడదు. మొటిమలను గిళ్ళడం వలన అవి మానడానికి ఎక్కువ సమయం పడుతుంది. సహజంగా తొలిగి పోయేలాగా చేయాలి.
  2. మొటిమలు ఉన్నవారు మంచి నీటితో తరచూ ముఖం కడుక్కుంటూ, శుబ్రంగా ఉంచుకోవాలి.
  3. మొటిమలు తగ్గడానికి కచ్చితంగా ఇంట్లో కొన్ని చిట్కాలు ప్రయత్నించాలి. 
  4. ప్రతి రోజు నీరు ఎక్కువగా తాగాలి, మొటిమలు రాకుండా ఉంటాయి. నీరు రోజు సరిపడా తాగితే ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా అందంగా ఉండవచ్చు.
  5. నూనె తో చేసిన వంటకాలు తినడం మానుకోవాలి, కొంత మందికి నూనె తో చేసిన వంటలు తినడం వలన pimples వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కావున బజ్జీలు, నూనె లో నుంచి తీసిన వంట పదార్థాలు దూరం పెట్టడం మంచిది.

pimple అంటే ఏంటి?

టీనేజ్లో  ఉండే వారిలో “androgen hormone” ఉత్పత్తి వలన చర్మంలోని “sebaceous” గ్రంథి sebum అనే కొవ్వును స్రవించడం వలన ఆ కొవ్వు పదార్థం జిడ్డుగా తయారు అవుతాయి, దీని వలన sebaceous గ్రంథులు కుడికుపోయి మొటిమలు రావడం జరుగుతుంది.  

మొటిమలు తగ్గడానికి ఆయుర్వేద చిట్కాలు - how to reduce pimples on the face naturally at home in Telugu

మొటిమలు తగ్గడానికి ఆయుర్వేదంలో చక్కటి చిట్కాలు

  1. తులసి రసం  తీసుకొని అందులో కొద్దిగా పసుపు కలిపి ముఖానికి పెట్టుకోవాలి. 
  2. మొటిమలు తగ్గడానికి ఆయుర్వేదంలోని జాజి కాయ చిట్కా, జాజి కాయను పొడి చేసి పాలతో కలిపి ముఖానికి రాసుకుంటే మొటిమలు తగ్గిపోతాయి.
  3. మొటిమలు తగ్గడానికి కొన్ని రకాల జ్యూస్ లు తాగడం కూడా మంచిది, క్యారెట్ జ్యూస్, వెజిటబుల్ జ్యూస్లు తాగడం ఉపయోగకరం మరియు న్యాచురల్ గా ఫేస్ గ్లో రావడానికి ఉపకరిస్తుంది. 

మొటిమలను తగ్గించడానికి న్యాచురల్ మరియు అత్యుత్తమమైన పద్దతి mudpack. ఈ mudpack వేసుకోవడం వలన సహజమైన చక్కటి ఫలితాన్ని పొందగలం.

న్యాచురల్ గా పింపల్స్ తొలగించడం ఎలా

Mudpack

ముఖం మీద ఉండే మొటిమలను దూరం చేయడానికి మట్టి ప్యాక్ చక్కగా పని చేస్తుంది. పొడిగా ఉండే నెల నుండి ఒక 5 అడుగుల లోతులో ఉన్న మట్టిని తీసి చక్కగా పొడి చేసి ఎండలో ఎండపెట్టాలి. ఆ తరువాత 2 స్పూన్స్ మట్టిని తీసి నీటిలో 2 గంటలపాటు నానబెట్టి ముఖానికి ప్యాక్ లాగా వేసుకోవాలి, ఒక 45నిమిషముల తర్వాత కడగాలి మొటిమలు అన్నీ చక్కగా తొలిగిపోతాయి.

వేపాకు

వేపాకు చర్మ సంబందిత వ్యాదులకు చక్కటి ఔషదంలాగా పనిచేస్తుంది. వేపాకులో అధికంగా ఔషదగుణాలు ఉంటాయి. ముఖం పైన ఉండే మొటిమాలను తోలగించడానికి వేపాకును వాడటం ఉత్తమం అని చెప్పవచ్చు.

వేపాకు, కొన్ని పూదిన ఆకులు మరియు పసుపు కలిపి పేస్ట్ చేసి ముఖానికి రాసుకొని అరగంట తరువాత కడగాలి ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మొటిమలు పోవడంతో పాటు చర్మం అందంగా మారుతుంది. 

Icepack

 ఫ్రీడ్జ్ లో ఉండే ఐస్ plate లోని ఐస్ ముక్కలను తీసుకొని లేదా ఐస్ బ్యాగ్ ని pimples ఉన్న చోట పెట్టి ప్రతి రోజు మసాజ్ చేసుకోవలి. ఎలా ప్రతి రోజు చేస్తూ ఉంటే క్రమంగా మొటిమలు తగ్గిపోతాయి. 

మొటిమలు రావడానికి కారణాలు !

మొటిమలు రావడానికి అనేక రకాల కారణాలు ఉన్నప్పటికీ, ప్రధానమైన కారణాలు ఇవే!

    1. హార్మోన్స్ imabalancing: harmone imbalance వలన కూడా మొటిమలు వచ్చే అవకాశం ఉంటుంది, కావున harmones balanced గా ఉండేలా ఆహారపదార్థాలు తీసుకోవాలి.  
    2. Pcod:  స్త్రీలలో ఉండే pcod(Polycystic ovary syndrome) సమస్య ఉన్న వారికి మొటిమలు ఉంటాయి. Pcod వలన టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. వాటి వలన ముఖం పైన మొటిమలు వచ్చే అవకాశం ఉంటుంది.  
    3. మన జీవన విదానం: మారుతున్న జీవన శైలి, మరియు పనిలో బాగంగా మానసిక వొత్తిడి, కాలుష్యం వలన మన శరీరంలో, చర్మం పైన చాలా రకాల మార్పులు అనారోగ్య సమస్యలు వస్తాయి. 
    4. ఆహారం : మనం తీసుకునే ఆహారంలో  high glycemic foods తీసుకోకూడదు(చెక్కర, sweets), ఎక్కువ చెక్కరలు కొవ్వులు ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం వలన కూడా మొటిమలు వస్తాయి.
    5. Makeups : ఈ రోజుల్లో అందంగా కనిపించడానికి makeups ఎక్కువగా వేసుకోనే విదానాన్ని అనుసరిస్తున్నారు. కానీ makeups వేసుకోవడం వలన చర్మం పైన ఉండే ఆయిల్ని స్రవించే రంద్రాలు మూసుకుపోయి, చర్మం పైన మొటిమలు రావడం మరియు చర్మ సహాజత్వాన్ని కోల్పోతూ ఉంటుంది. 

ఒక్క రోజులో మొటిమలను సహజంగా ఎలా తొలగించాలి ? - pimple removal home remedy in Telugu

మొటిమల వలన వచ్చే నల్లటి మచ్చలు పోవాలంటే ఎం చెయ్యాలి?- how to remove blackheads in Telugu pimples

Published by

Health Tips telugu

Health Tips telugu

healthtipstelugu.in is the best resource for quality health tips in Telugu. Our website provides visitors with an easy way to find the best health tips for staying healthy and fit. We provide reliable health information in an easy-to-understand format, so you can make the most of your health.

5/5 - (149 votes)