నువ్వుల ద్వారా 15 ఆరోగ్య మరియు పోషణ లాభాలు - Sesame Seeds in Telugu
Nuvvulu uses in Telugu
Sesame Seeds Meaning in Telugu
Sesame Seeds ని తెలుగులో “నువ్వుల గింజలు” అంటారు.
50% off : అతి తక్కువ ధరకి నువ్వులని Amazon లో Order చేస్కోండి
నువ్వులు తినండి ఆరోగ్యంగా జీవించండి
కింద ఉన్న link క్లిక్ చేసి Discount పొందండి
Sesame Seeds Price : ₹ 349
Sesame Seeds Uses in Telugu
నువ్వులు పరిమాణంలో చిన్నగా ఉంటాయి. ఇవి చెట్టు కాయల్లో పెరుగుతాయి, నువ్వుల ద్వారా నువ్వుల నూనె కూడా లభిస్తుంది, నువ్వుల యొక్క శాస్త్రీయ నామము ” సేసామమ్ ఇండికమ్”.
పొట్టు తీసిన నువ్వులను చక్కగ తినవచ్చు, ఎక్కువ రోజుల వరకు చెడి పోకుండా ఉంటాయి.
నువ్వులు చూడడానికి తెల్లగా ఉంటాయి వాటిని కాల్చినప్పుడు బంగారు గోధుమ రంగులోకి మారతాయి.
నువ్వులు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి అలాగే వేలాది సంవత్సరాలుగా వైద్య రంగంలో ఉపయోగిస్తున్నారు. నువ్వుల వలన గుండె జబ్బులు, మధుమేహం మరియు కీళ్లనొప్పుల వంటి ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు.
ఆరోగ్య ప్రయోజనాలను పొందేందుకు మీరు అలవాటుగా – రోజుకు కొద్దిపాటి చొప్పున తీసుకోవాల్సి ఉంటుంది. నువ్వుల యొక్క 15 ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.
1. ఎక్కువ ఫైబర్ కలిగి ఉంటాయి.
మూడు టేబుల్ స్పూన్ల (30 గ్రా) 12% ఫైబర్ ఉంటుంది.. పొట్టు తీసిన నువ్వుల గింజలలో 3.5 గ్రాముల ఫైబర్ లభిస్తుంది,
ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగు పరచడంలో తోడ్పడుతుంది. అదనంగా గుండె జబ్బులు, కొన్ని రకాల క్యాన్సర్లు, ఊబకాయం మరియు టైప్ 2 మధుమేహం వంటి ప్రమాదాలని తగ్గించడంలో ఫైబర్ సహాయ పడుతుంది.
2. కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిజరైడ్‌లను తగ్గించవచ్చు.
కొన్ని అధ్యయనాల ప్రకారం క్రమం తప్పకుండా రోజు నువ్వులు తిన్నట్లయితే గుండె జబ్బులకు కారణమైన అధిక కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిజరైడ్‌లను తగ్గిస్తాయి.
నువ్వులు 15% సాచురేటెడ్ కొవ్వును, 41% పోలీ అంసాచురేటెడ్ కొవ్వును మరియు 39% మోనోశాచురేటెడ్ కొవ్వును కలిగి ఉంటాయి.
నువ్వులలో ఉండే సాచురేటెడ్ కొవ్వున, పాలీఅన్‌శాచురేటెడ్ మరియు మోనోశాచురేటెడ్ కొవ్వు కొలెస్ట్రాల్‌ను మరియు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
నువ్వులు రెండు రకాల మొక్కల సమ్మేళనాలను కలిగి ఉంటాయి – లిగ్నాన్స్ మరియు ఫైటోస్టెరాల్స్ – ఇవి కొలెస్ట్రాల్-తగ్గించే ప్రభావాలను కలిగి ఉంటాయి.
నువ్వులు ఎలివేటెడ్ ట్రైగ్లిజరైడ్ మరియు “చెడు” LDL కొలెస్ట్రాల్ సహా గుండె జబ్బు వంటి ప్రమాద కారకాలను తగ్గించడంలో ఎంతో సహాయపడతాయి.
3. నువ్వులలో మొక్కల్లో ఉండే ప్రోటీన్స్ మరియు పోషకాలు ఉంటాయి.
3-టేబుల్స్పూన్ (30-గ్రా) నువ్వులు తీసుకుంటే 5 గ్రాముల ప్రోటీన్ సరఫరా చేస్తుంది.
శరీరానికి సరిపడా ప్రోటీన్ ని అందించడానికి, వేయించిన నువ్వులు తీసుకోవాలి. నువ్వులను వేయించినప్పుడు వాటిలో ఉండే ఆక్సలేట్‌లు మరియు ఫైటేట్‌లను మీ జీర్ణక్రియ మరియు ప్రోటీన్ అబ్సర్బ్షన్ ఆటంకాన్ని తగ్గిస్తాయి.
ప్రోటీన్ మన శరీరానికి ఎంతో అవసరం, కండరాల నుండి హార్మోన్ల వరకు ప్రతిదానిని నిర్మించడంలో ప్రోటీన్ సహాయపడుతుంది.
నువ్వులలో లైసిన్ తక్కువగా ఉంటుంది అలాగే చాలా ముఖ్యమైన జంతువులలో ఉండే అమీనో ఆసిడ్ దొరుకుతుంది. అయితే, శాకాహారుల అధిక-లైసిన్ మొక్కల ప్రోటీన్లను ముఖ్యంగా కిడ్నీ బీన్స్(రాజ్మా ) మరియు చిక్‌పీస్ వంటివి తీసుకోవడం ద్వారా బాలన్స్ చేయవచ్చు.
నువ్వులలో రెండు అమైనో ఆసిడ్స్ మెథియోనిన్ మరియు సిస్టీన్ అధికంగా ఉంటాయి.
సారాంశం
నువ్వులు – ముఖ్యంగా పొట్టుతో కూడినవి – మీ శరీరానికి అవసరమైన ప్రోటీను అందిస్తాయి.
4. రక్తపోటు వచ్చే అవకాశాలును తగ్గిస్తాయి.
గుండె జబ్బులు మరియు స్ట్రోక్‌కి బ్లడ్ ప్రెషర్ ఒక ప్రధాన కారణం. నువ్వులలో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది ఇది బ్లడ్ ప్రెషర్ ను తగ్గించడంలో చాల సహాయపడుతుంది.
నువ్వులలోని లిగ్నాన్స్, విటమిన్ E ఇతర యాంటీఆక్సిడెంట్లు మీ రక్త నాళాలు అలాగే రక్త ప్రవాహానికి సహాయపడతాయి.
ఒక అధ్యయనంలో, అధిక బ్లడ్ ప్రెషర్ ఉన్న వ్యక్తులు ప్రతిరోజూ 2.5 గ్రాముల పొడి, నల్ల నువ్వులను – క్యాప్సూల్ రూపంలో తీసుకున్నపుడు నెల చివరిలో, వారు సిస్టోలిక్ రక్తపోటులో 6% తగ్గుదలని గుర్తించారు.
సారాంశం
నువ్వులలో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది, ఇది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది.
5. ఆరోగ్యమైన ఎముకల పెరుగుదల.
నువ్వులు ఎముకల పెరుగుదలకు ఎంతో పోషణ అందిస్తాయి, గింజల పొట్టులో కాల్షియమ్ ఉంటుంది ఇదే ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
నువ్వులు మూడు టేబుల్స్పూన్స్ (30 గ్రా ) తీసుకున్నట్టయితే. (Reference Daily Intake – రోజు వారి ఆహార సూచన )
పొట్టు తీసిన గింజలు | పొట్టు తీయని గింజలు | |
కాల్షియమ్ | RDI లో 22% | RDI లో 1% |
మెగ్నీషియం | RDI లో 25% | RDI లో 25% |
మాంగనీస్ | RDI లో 32% | RDI లో 195% |
జింక్ | RDI లో 21% | RDI లో 18% |
నువ్వులు ఆక్సలేట్‌లు మరియు ఫైటేట్‌లు అనే సహజ కంపౌండ్స్ ను కలిగి ఉంటాయి.నువ్వులలోని పోషకాలను పొందటానికి, విత్తనాలను నానబెట్టడం, కాల్చడం లేదా మొలకెత్తడం లాంటివి చెయ్యాలి .
ఒక అధ్యయనం కనుగొన్నదేంటంటే నువ్వుల మొలకలు ఫైటేట్ మరియు ఆక్సలేట్ గాడత 50% వరకు తగ్గించింది.
సారాంశం
పొట్టు తీసిన నువ్వులు ముఖ్యంగా ఎముకల ఆరోగ్యానికి కీలకమైన కాల్షియం పోషకాలను కలిగి ఉంటాయి. నువ్వులను నానబెట్టడం, కాల్చడం లేదా మొలకెత్తడం వంటివి చేస్తే మంచి ఫలితాలు కనబడతాయి.
6. శరీర ఊబకాయాన్ని తగ్గిస్తాయి.
నువ్వులు ఊబకాయాన్ని తగ్గిస్తాయి. ఊబకాయం, కాన్సర్, గుండె జబ్బులను, నువ్వులను క్రమం తప్పకుండా వాడితే కిడ్నీ సంబంధిత వ్యాధులను అదుపులో ఉంచుతాయి .
కిడ్నీ సమస్యలతో చింతిస్తున్న వారు మూడు నెలల పాటు వాడాలి. 18 గ్రా అవిసెలు, 6 గ్రా నువ్వులు అలాగే గుమ్మడి గింజలను కలిపి తిన్నపుడు 51%‒79% ఊబకాయ తగ్గింది.
సారాంశం
ప్రాథమిక పరిశోధనలు నువ్వులు అలాగే వాటి నూనె వాడటం వల్ల ప్రజలు శరీర కొవ్వును తగ్గించుకున్నారని తేల్చాయి.
7. బి విటమిన్స్ లభిస్తాయి.
నువ్వులలో ఎన్నో బి విటమిన్ పోషకాలు ఉన్నాయి.
నువ్వులు మూడు టేబుల్స్పూన్స్ (30 గ్రా ) తీసుకున్నట్టయితే. (Reference Daily Intake – రోజు వారి ఆహార సూచన )
పొట్టు తీసిన గింజలు | పొట్టు తీయని గింజలు | |
థయామిన్ (B1) | RDI లో 17% | RDI లో 19% |
నియాసిన్ (B3) | RDI లో 11% | RDI లో 8% |
విటమిన్ (B6) | RDI లో 5% | RDI లో 14% |
శారీర మెటబాలిజం అలాగే సెల్ ఫంక్షన్ కొరకు B విటమిన్స్ ఎంతగానో తోడ్పడతాయి.
సారాంశం
నువ్వులు థయామిన్ (B1) నియాసిన్ (B3) విటమిన్ (B6) ఇవి శరీర మెటబాలిజం అలాగే సెల్ ఫంక్షన్ కొరకు ఎంతగానో తోడ్పడతాయి.
8. ఎర్ర రక్తకణాల నిర్మాణంలో సహాయపడతాయి.
నువ్వులు మన శరీరంలో ఎర్ర రక్త కణాలను తయారు చేసుకోడానికి అనేక పోషకాలను అందజేస్తాయి.
నువ్వులు మూడు టేబుల్స్పూన్స్ (30 గ్రా ) తీసుకున్నట్టయితే. (Reference Daily Intake – రోజు వారి ఆహార సూచన )
పొట్టు తీసిన గింజలు | పొట్టు తీయని గింజలు | క్రియ | |
ఐయన్ | RDI లో 24% | RDI లో 10% | ఎర్ర రక్త కణాలలో ముఖ్యమైన కంపోనెంట్ |
కాపర్ | RDI లో 136% | RDI లో 46% | హిమోగ్లోబిన్ తయారికి తోడ్పడతాయి. |
విటమిన్ (B6) | RDI లో 5% | RDI లో 14% | హిమోగ్లోబిన్ తయారికి తోడ్పడతాయి. |
సారాంశం
నువ్వులు రక్త కణాల నిర్మాణం కొరకు మరియు పనితీరుకు అవసరమైన ఇనుము, రాగి మరియు విటమిన్ B6ని సరఫరా చేస్తాయి.
9. రక్తంలోని షుగర్ ను అదుపుచేస్తాయి.
నువ్వులలో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి ప్రోటీన్ మరియు ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి ఇవన్నీ రక్తంలో చక్కెర నియంత్రణకు తోడ్పడతాయి.
నువ్వులలో పినోరెసినోల్ అనే ద్రవము ఉంటుంది దీన్ని వల్లనే రక్తంలో చక్కెరను నియంత్రించవచ్చు.
మాల్టోస్ షుగర్ మాల్టోజ్ ను వేరుచేస్తుంది , ఇది కొన్ని ఆహార ఉత్పత్తులకు స్వీటెనర్‌గా ఉపయోగించబడుతుంది. బ్రెడ్ మరియు పాస్తా వంటి పిండి పదార్ధాల జీర్ణక్రియలో ఉత్పత్తి అవుతుంది.
పినోరెసినాల్ మీ జీర్ణక్రియ షుగర్ మాల్టోస్ ను విడగొట్టి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది.
సారాంశం
నువ్వులు రక్తంలో చక్కెర నియంత్రణలో సహాయపడతాయి వీటిలో పిండి పదార్థాలు తక్కువగా ఉంటాయి మరియు నాణ్యమైన ప్రోటీన్ మరియు ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి అంతేగాక మొక్కల్లో ఉండే కంపౌండ్స్ ను కలిగి ఉంటాయి.
10.యాంటీఆక్సిడాంట్స్ అధిక సంఖ్యలో కలిగి ఉంటాయి.
జంతు మరియు మానవ అధ్యయనాలు నువ్వులను తీసుకోవడం వల్ల మీ రక్తంలో యాంటీఆక్సిడెంట్ సంఖ్య పెరుగుతుందని సూచిస్తున్నాయి.
నువ్వుల గింజలలోని లిగ్నన్లు కణాలను దెబ్బతీసే అనేక దీర్ఘకాలిక వ్యాధుల నుండి యాంటీఆక్సిడెంట్లుగా ఆక్సీకరణ ఒత్తిడితో సహాయపడతాయి.
నువ్వులు గామా-టోకోఫెరోల్ అని పిలువబడే విటమిన్ E యాంటి ఆక్సిడెంట్స్ కలిగి ఉంటాయి ఇది గుండె జబ్బుల నుండి కాపాడుతుంది.
సారాంశం
నువ్వుల గింజలలోని విటమిన్ E యాంటీఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి, ఇవి మీ శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కొంటాయి.
11. రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తాయి.
నువ్వులు రోగనిరోధక వ్యవస్థకు కీలకమైన జింక్, సెలీనియం, రాగి, ఇనుము, విటమిన్ B6 మరియు విటమిన్ E వంటి అనేక పోషకాలను కలిగి ఉంటాయి.
మన శరీరానికి జింక్ ఎంతగానో అవసరం ఇది తెల్ల రక్త కణాల ఉత్పత్తికి తోడ్పడుతుంది. నువ్వులు 3 టేబుల్స్పూన్ (30 గ్రా)లో 20% RDI కలిగి ఉంటుంది. (Reference Daily Intake – రోజు వారి ఆహార సూచన)
సారాంశం
నువ్వులు రోగనిరోధక వ్యవస్థకు కీలకమైన జింక్, సెలీనియం, రాగి, ఇనుము, విటమిన్ B6 మరియు విటమిన్ E వంటి అనేక పోషకాలను కలిగి ఉంటాయి.
12. కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది.
కీళ్ల నొప్పులకు ఆస్టియో ఆర్థరైటిస్ అత్యంత సాధారణ కారణం . నువ్వుల గింజల్లో ఉండే సేసమిన్ అనే కాంపౌండ్ ఊబకాయాన్ని నివారిస్తుంది.
కీళ్ల నొప్పులతో బాధపడే వారికి 2 నెలలు పాటు రోజు 5 టేబుల్ స్పూన్స్ (40 గ్రా ) నువ్వులు ఇచ్చినప్పుడు వారికి 63% వరకు నొప్పులు తగ్గాయి అదే ఇంగ్లీష్ మందులు,మాత్రలు వేసుకునేవారికి 22% మాత్రమే నొప్పి తగ్గింది.
సారాంశం
నువ్వుల గింజల్లో ఉండే సేసమిన్ అనే కాంపౌండ్ ఊబకాయాన్ని నివారిస్తుంది.
13.థైరాయిడ్ ను నివారిస్తుంది.
నువ్వుల గింజలలో సెలీనియం ఉంటుంది ఇది RDI లో 18% కలిగి ఉంటుంది. (Reference Daily Intake – రోజు వారి ఆహార సూచన )
మన శరీరంలో ఉన్న థైరాయిడ్ గ్లాండ్ లో సెలీనియం ఎక్కువగా ఉంటుంది, సెలీనియం థైరాయిడ్ హర్మోన్స్ని తయారు చేయడంలో సహాయపడుతుంది.
నువ్వులు థైరాయిడ్ హార్మోన్స్ తయారీకి అవసరమైన ఇనుము, రాగి మరియు విటమిన్ B6ని సరఫరా చేస్తాయి.
సారాంశం
నువ్వుల్లో థైరాయిడ్ ను నియంత్రించడానికి అవసరమైన సెలీనియం, ఐరన్, కాపర్, జింక్ అలాగే విటమిన్ B6 పోషకాలు ఉన్నాయి.
14. హార్మోన్స్ను బాలన్స్ చేస్తాయి.
నువ్వుల్లో ఫీతోస్ట్రోజెన్స్ ఉంటాయి ఇవి ఈస్ట్రోజెన్ లాంటి హార్మోన్స్. నువ్వులు ఆడవారికి ఎంతగానో ఉపయోగపడతాయి, మెనో పౌస్ లో ఎట్రోజెన్ లెవెల్ తగ్గినప్పుడు బాలన్స్ చేస్తాయి అలాగే బ్రెస్ట్ కాన్సర్ ను నివారిస్తాయి. .
సారాంశం
నువ్వులలో ఫీతోస్ట్రోజెన్స్ కంపౌండ్స్ ఉన్నాయి ఇవి ఆడవారికి మెనోపాస్ సమయంలో హార్మోనల్ బ్లంస్ కి సహాయపడతాయి.
15.మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
ఆహారాన్ని మరింత రుచికరంగా మార్చాలంటే, నువ్వులను 350℉ (180℃) వేడిలో కాస్త గోధుమ రంగు వచ్చే వరకు కాల్చి ఆ తరువాత వంటలో వాడాలి.
నువ్వులను కాల్చి పొడిగా చేసి, కూరలలో వేసినప్పుడు కొత్త రుచి వస్తుంది. కూరలలోనే కాకుండా అన్నంలో కూడా పొడిని వేసుకొని తినవచ్చు.
సారాంశం
నువ్వులను వంటల్లో ఉపయోగించి కూడా తీసుకోవచ్చు , గోధుమ రంగు వచ్చే వరకు కాల్చి పొడిగా చేసి వాడాలి.
తాత్పర్యము
నువ్వులు ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, B విటమిన్లు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు మరియు ఇతర ప్రయోజనకరమైన మొక్కల సమ్మేళనాలకు కలిగి ఉంటాయి.
ఈ నువ్వులును క్రమం తప్పకుండా తినడం వళ్ళ రక్తంలో చక్కెర నియంత్రణ, ఆర్థరైటిస్ నొప్పిని ఎదుర్కోవడం మరియు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది.
మీ పోషకాలను మెరుగు పరుచుకోవడానికి , మీరు నానబెట్టిన, కాల్చిన లేదా మొలకెత్తిన నువ్వులను తినాలి.
Published by
Health Tips telugu
healthtipstelugu.in is the best resource for quality health tips in Telugu. Our website provides visitors with an easy way to find the best health tips for staying healthy and fit. We provide reliable health information in an easy-to-understand format, so you can make the most of your health.
Health Tips Telugu is founded and maintained by a group of medical professionals and health enthusiasts passionate about providing accurate, up-to-date health information to Telugu speakers around the world. We follow strict editorial practices to provide only truthful, unbiased health guidance that readers can rely on. We reference reputable health organizations, academic medical centers and peer-reviewed journals when developing our articles.