Castor Oil Meaning in Telugu

castor oil ని తెలుగులో ఆముదం నూనె అంటారు. ఆముదం యొక్క botanical పేరు ricinus communis  అని పిలుస్తారు. ఈ ఆముదం Euphorbiaceae కుటుంబానికి సంబంధించినది, ఆముదం మొక్క బాహువార్షిక మొక్కగా పెరుగుతూ ఉంటాయి, ఆముదం చెట్లు విరివిగా చెరువు గట్ల వద్ద కనిపిస్తూ ఉంటాయి. ఆముదం చెట్టు అద్బుతమైన మహా ఔషదం అని చెప్పవచ్చు. ఆముదం నూనె ఉపయోగలను ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.

Castor ఆయిల్లో Ricinoleic Acid మరియు ఒమేగా 6, antiviral, antioxidants, antifungal, anti aging మరియు విటమిన్ E అదికంగా ఉంటాయి.
ఆముదం నూనె జిగటగా చిక్కగా ఉంటుంది. ఆముదం నూనె వాసన కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. కానీ ఆముదం నూనె వలన ప్రయోజనాలు పుష్కలంగా ఉంటాయి.

How to use castor oil for hair in telugu

పూర్వ కాలంలో ఆముదం నూనెను ఎక్కువగా వాడేవారు, కావున మన ఇంట్లో పెద్దల జుట్టు దృడంగా బలంగా పొడువుగా ఉండేది. 

ఆముదం నూనె జుట్టు పెరగడానికి చాలా చక్కగా పనిచేస్తుంది ఈ ఆముదం నూనె వారానికి మూడు సార్లు జుట్టుకి పెట్టుకోవడం వలన జుట్టు బాగా పెరిగి చుండ్రు లేకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది. ఆముదం నూనె జుట్టుకి ఎలా పెట్టుకోవలో తెలుసుకుందాం. 

ఆముదం నూనె జుట్టుకి పెట్టుకునేటప్పుడు కొబ్బరి నూనె కూడా కలిపి తీసుకోవాలి. coconut ఆయిల్ లో విటమిన్ A మరియు విటమిన్ K లు కూడా ఉంటాయి. 

అయితే ఆముదం నూనె 1 స్పూన్ తీసుకుంటే కొబ్బరి నూనె 2 స్పూన్స్ తీసుకోవాలి ఆముదం నూనె జీగాటగా ఉండటం వలన కొబ్బరి నూనె కలపడం మంచిది.

కొబ్బరి నూనె కాకుండా వేరే ఏ ఇతర నూనె అయిన పెట్టుకోవచ్చు. ఆముదం నూనె మరియు కొబ్బరి నూనె (జుట్టుకి వాడే ఇతర నూనెలు) ఈ రెండు రకాల నూనెలను తీసుకొని బాగా కలిపి జుట్టుకు అంటే తలకు పెట్టాలి, జుట్టు మొదటి బాగానికి అందేలా నూనె పెట్టాలి.  

జుట్టుకు నూనె పెట్టిన తరువాత ఐదు నుండి పది నిమిషాల పాటు మర్దన చేయాలి. ఇలా చేయడం వలన తల బాగంలో రక్త ప్రసరణ బాగా జరిగి జుట్టు పెరగడానికి చక్కగా సహాయపడుతుంది.

జుట్టులో split ends ఉన్నవారు జుట్టు చివరికి కూడా ఆముదం నూనె పెట్టాలి ఇలా పెట్టడం వలన split ends పోయి జుట్టు త్వరగా పెరగటానికి సహాయపడుతుంది.

ఆముదం నూనె ఉపయోగాలు - castor oil benefits in telugu

ఆముదం నూనె వాడితే చాలా సమస్యలుకు పరిష్కారం దొరుకుతుంది. 

  1. సాధారణంగా నులిపురుగు మరియు మలబద్దకం నివారణ కోసం ఆముదం నూనె ఎక్కువగా వాడుతారు. అయితే నాలుగు స్పూన్స్ కొబ్బరి నూనె తీసుకొని 2 స్పూన్స్ ఆముదం నూనె కలిపి మెత్తని వస్త్రాన్ని అందులో ముంచి పొట్ట మీద రాత్రి అంతా అలాగే ఉంచాలి. ఇలా చేయడం వలన ఉదయం వరకు నులి పురుగులు  చనిపోతాయి.
  2. ఆముదం నూనె కీళ్ల నొప్పులు తగ్గడానికి మంచి ఔషదంలాగా పని చేస్తుంది. కీళ్ల నొప్పులు ఉన్న చోట ఆముదం నూనెతో మర్దన చేయాలి. ఆముదం నూనెలో ముంచిన వస్త్రాన్ని నొప్పి ఉన్న చోట ప్లాస్టిక్ కవర్ తో కట్టాలి ఇలా ఒక గంట సేపు ఉంచాలి, ఆ తరువాత ఆ ప్రదేశంలో వేడినీటితో లేదా వేడి వస్తువుని పెట్టి కొద్దిసేపు మర్దన చేయాలి.
  3. ఆముదం నూనె ముఖానికి కూడా పెట్టవచ్చు, ఎండ వల్ల కమిలిపోయి నల్లగా అయిన చర్మం మళ్ళీ మామూలుగా అవ్వాలి అంటే ఆముదం నూనె పూతలాగా పూసి ఒక గంట తరువాత కడగాలి.

     

  4. ఆముదం నూనె చర్మ సౌందర్యానికి అద్బుత ఔషదం అని చెప్పవచ్చు, ఆముదం నూనెను చర్మం పైన పూతలాగా పూయాలి ఇలా చేయడం వలన చర్మం బిగుతుగా అవ్వడమే కాకుండా ముడతలు కూడా తగ్గుతాయి. ఆముదం చర్మం అడుగున ఉండే కొల్లజెన్ ఉత్పత్తిని పెంచుతుంది.
  5. ఆముదంలో ఉండే ఒమేగా 2 fatty acids వలన చర్మం పైన పూయడంతో ఆరోగ్యకరమైన కణజాలం వృద్ది చెంది, మచ్చలు పోతాయి.
Castor oil in telugu

castor ఆయిల్ కళ్ల కింద నల్లటి వలయాలు(dark circles) పోవడానికి చక్కగా పనిచేస్తుంది

  • castor ఆయిల్ ని రెండు చుక్కలు తీసుకొని వేళ్ళతో కన్ను చుట్టూ పెట్టి ఐదు నిమిషాలు మర్దన చేయాలి ఇలా రోజు చేయాలి, ఇలా చేయడం వలన కళ్ల కింద నల్లటి వలయాలు పోతాయి. 

పసిపిల్లలకు ఆముదం నూనె

మన పూర్వీకుల కాలంలో చిన్న పిల్లలకు కూడా ఆముదం నూనె వాడేవారు, చిన్న పిల్లల తలకు ఆముదం నూనెను ప్రతి రోజు పెట్టె వారు అలా చేయడం వలన పిల్లల జుట్టు చక్కగా ఉండేది.  

eye బ్రోస్ మరియు eye lashes కి ఆముదం నూనె

ఆముదం నూనె మరియు ఆలివ్ ఆయిల్ రెండిటినీ కలిపి కన్ను రెప్పలకి eye browsకి పెట్టడం వలన ఐ బ్రోస్ తక్కువగా ఉంటే త్వరగా పెరగటానికి మరియు నలుపు రంగులో కనిపించడానికి చక్కగా ఉపయోగపడుతుంది. ఇలా వరుసగా పదిహేను రోజులు వాడితే చక్కగా కనిపిస్తాయి. రోజు రాత్రి పడుకునే ముందు ముఖం కడుక్కొని వాడాలి.

గోర్లు పెరగటానికి ఆముదం నూనె ఉపయోగపడుతుంది

ఒక రెండు చుక్కల ఆముదం నూనె తీసుకొని గోర్ల పైన పూయాలి, ఇలా పూయడం వలన గోర్లు చిగురులు బలంగా ఉంటాయి, గోర్లు మెరుస్తూ అందంగా కనిపిస్తాయి.

చేతులను మరియు అరచేతులను సున్నితంగా చేయడానికి ఆముదం నూనె ఎలా వాడాలి?

ఆముదం నూనెను రెండు చుక్కలు తీసుకొని చేతులకి మరియు అరచేతులకి పూయడం వలన చేతులు సున్నీతంగా తయారు అవుతాయి. స్త్రీలు గిన్నెలు తోమడం వలన చేతులు పొడిబారీ పోయి ఉంటాయి అలాంటి వారు, రోజు ఆముదం నూనె చేతులకి పూయడం వలన చేతులు మృదువుగా, సున్నీతంగా తయారు అవుతాయి. 

అరికాళ్ళలో పగుళ్లు పోవడానికి ఆముదం నూనె ఉపయోగపడుతుంది

Frequently Asked Questions about weight gain tips in Telugu

castor oil ని తెలుగులో ఆముదం నూనె అంటారు

ఆముదం నూనెని జుట్టు పెరగటానికి మరియు కాళ్ళ నొప్పులు పోవడానికి ఉపయోగించవచ్చు.

ఆముదం నూనె ను జుట్టుకు వాడేటప్పుడు కొబ్బరి నూనెతో కలిపి వాడాలి

castor oilని ముఖానికి వాడవచ్చు, ముఖానికి ఆముదం నూనె వాడటం వలన మంచి ప్రయోజనాలు పొందుతారు.   

ఆముదం నూనె జుట్టుకి రోజు వాడకూడదు, రోజు ఆముదం నూనె వాడటం వలన వ్యతిరేక ప్రభావం కలిగే అవకాశం ఉంది.  

Published by

Health Tips telugu

Health Tips telugu

healthtipstelugu.in is the best resource for quality health tips in Telugu. Our website provides visitors with an easy way to find the best health tips for staying healthy and fit. We provide reliable health information in an easy-to-understand format, so you can make the most of your health.

Disclaimer: This post may include affliate links. lf you click one of them, we may receive a cute
commission at no extra cost to you. Thank you.

5/5 - (149 votes)