Face glowing tips in Telugu - న్యాచురల్ గా ఫేస్ గ్లో రావాలంటే ఏం చేయాలి?
బ్యూటీ టిప్స్ తెలుగులో
ఈ రోజుల్లో అందరం కోరుకునేది అందం, చర్మం అందంగా కాంతి వంతంగా, సున్నితంగా లేకపోతే చాలా మంది ఆత్మ విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటారు. చర్మం మెరుస్తూ నిగానిగలాడేలాగా ఉండాలని అందరం ఆశపడుతాం! కానీ చర్మాన్ని ఎలా మెరిసెల చేసుకోవాలి ఎలాంటి Face glowing tips అనుసరించాలి, అని వివిద ప్రయత్నాలు చేసి ఎటువంటి ఫలితం రాకపోతే ఇంకా అందగా కనిపించం ఏమో అనే ఆందోళన మొదలవుతుంది.
50% off : అతి తక్కువ ధరకి Face Wash, Amazon లో Order చేస్కోండి
కింద ఉన్న link క్లిక్ చేసి Discount పొందండి
Himalaya Face Wash Price : ₹ 243
glowing skin secrets - Face glow tips in Telugu
న్యాచురల్ గా ఫేస్ గ్లో ఎలా అవ్వాలి అని ఆలోచిస్తూ ఉంటాము, ఎన్నో ప్రయత్నాలు చేసి ఆశించిన ఫలితం రాక ఆందోళన చెందుతూ ఉంటాం, సహజంగా ఎటువంటి కెమికల్స్ వాడకుండా చర్మాన్ని ముఖాన్ని ఎలా మెరిపించాలి? సులువుగా చర్మం అందంగా కాంతి వంతంగా మారటానికి అద్బుతమైన ప్రయోజనాలను అద్బుతమైన Face glowing tipsని ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం!
ఫేస్ గ్లో రావాలంటే సరిపడా నీరు త్రాగలి - Face glowing tips in Telugu
Face glow tips లో నీరు ముఖ్య పాత్ర పోషిస్తుంది. చర్మం సహజంగా కాంతివంతంగా ముడతలు లేకుండా మారాలి అంటే నీరు ఎక్కువ గా తాగాలి. నీటిని ఎక్కువగా తాగటం వలన skin tone మెరుగుపడి కొల్లాజెన్ సమృద్దిగా ఉండటానికి సహకరిస్తుంది. చర్మం నీటిగా ఉండటానికి ఒక రోజుకి నాలుగు లీటర్స్ వరకు నీటిని తాగటం ఉత్తమం.
Beauty tips for face at home in Telugu
- తొందరగా ఇంట్లోనే చర్మాన్ని కాంతి వంతగా మార్చడానికి చక్కటి చిట్కాలు.
- చర్మానికి పచ్చి పాలలోని మీగడ రాసి 15 నిమిషాల తరువాత కడగాలి ఇలా చేస్తే చర్మంలోని మురికి పోయి సున్నితంగా తయారు అవుతుంది.
తెల్లగా అవ్వాలంటే ఏం చేయాలి - Face Whitening Tips Telugu
గోదుమ పిండి ఒక స్పూన్ తిసుకొని అందులో ఒక స్పూన్ పెరుగు, ఒక స్పూన్ పాలు, నాలుగు చుక్కల నిమ్మరసం మరియు చిటికెడు పసుపు వేసి బాగా అన్నీ కలిసిపోయే లాగా చక్కగా కలపాలి. ఆ తరువాత ఈ పేస్ట్ ని ప్యాక్ లాగా ముఖానికి రాయాలి, 15 నిమిషాల తరువాత కొన్ని పాలు తీసుకొని ఒక చిన్న దూదిని ఆ పాలలో ముంచి circular motion లో ముఖం పైన రుద్దాలి, మళ్ళీ 10 నిమిషాల తరువాత దూదిని పాలలో ముంచి ముఖం మొత్తం రాయాలి ఆ తరువాత మామూలుగా నీటితో కడగాలి ఇలా కడిగిన 2గంటల వరకు ఎటువంటి soaps కానీ chemicals కానీ వాడకూడదు.
ఇలా చేస్తే డెడ్ స్కిన్ cells పోయి చర్మం అందంగా తయారు అవుతుంది. గోదుమ పిండి అన్నీ రకాల చర్మం ఉన్నవారికి సహకరిస్తుంది అంటే ఆయిల్ స్కిన్, డ్రై స్కిన్ ఉన్నవారికి కూడా పని చేస్తుంది అని చెప్పవచ్చు. గోదుమ పిండి చర్మాన్ని ఆరోగ్యంగా మరియు కాంతివంతగా ఉంచటానికి సహాయపడుతుంది.
50% off : అతి తక్కువ ధరకి Face Wash, Amazon లో Order చేస్కోండి
కింద ఉన్న link క్లిక్ చేసి Discount పొందండి
Himalaya Face Wash Price : ₹ 243
బ్యూటీ టిప్స్ తెలుగులో - Face Glow Tips in Telugu
అవిసెగింజల ప్యాక్
అవిసె గింజలలో అధిక పోషక విలువలు ఉంటాయి కావున అవిసె గింజలను ఫేస్ ప్యాక్ గా వేసుకున్న లేదా మనం తీసుకునే ఆహార పదార్థాలతో పాటు తీసుకోవడం వలన చర్మం ఆరోగ్యంగా కాంతి వంతంగా తయారు అవుతుంది.
“అవిసె గింజల ప్యాక్ గురించి ఇక్కడ తెలుస్కోండి”
చియా seeds ఫేస్ ప్యాక్
చియా విత్తనాలను ముఖానికి రాసుకోవడం వలన ముఖం అందంగా మెరుస్తుంది చియా వితనాలలో ఉండే పోషకాలు చర్మాన్ని కాంతి వంతంగా మృదువుగా తయారు చేస్తుంది.
“చియా విత్తనాలతో ఫేస్ ప్యాక్ ఇక్కడ తెలుసుకోండి”
సబ్జా సీడ్స్
సబ్జా సీడ్స్ లో ఎక్కువ శాతం విటమిన్స్ మరియు మీనురల్స్ ఉండటం వలన సబ్జా సీడ్స్ ని ముఖానికి వాడితే లేదా సబ్జా సీడ్స్ ని వాటర్ లో నానబెట్టుకొని తాగిన లేదా fruit juices, ice creams తో తీసుకున్న చర్మం అందంగా ఉంటుంది.
సబ్జా సీడ్స్ ఉపయోగాలు ఇక్కడ తెలుసుకోండి.
ఆడవాళ్ళ అందానికి చిట్కాలు - Beauty Tips for Women in Telugu
- చర్మం అందంగా ఎటువంటి మురికి మరియు pimples లేకుండా ఉండటానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
- బయట నుంచి రాగానే శుబ్రంగా ముఖం కడగాలి.
- బయటకి వెళ్ళినప్పుడు వాతావరణ కాలుష్యం చర్మం పైన పడే అవకాశం ఉంటుంది. స్కార్ఫ్ లాంటి వాటితో ముఖాన్ని దాచుకోవాలి.
- జుట్టులో ఉండే చుండ్రు వలన కూడా ముఖం పైన pimples వచ్చే అవకాశం ఉంటుంది. కావున చుండ్రు లేకుండా జాగ్రత్త పడాలి.
- సూర్య నుండి వచ్చే అతి నిలలోహిత కిరణాల వలన చర్మం నల్లపడుతూ ఉంటుంది. చర్మానికి ఎండ తగలకుండ చూడాలి.
- హార్మోన్స్ సరిగ్గా ఉత్పత్తి కాకపోవడం వలన కూడా చాలా రకాల చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది, కావున హార్మోన్స్ ఉత్పత్తిని మెరుగు పరుచుకోవాలి.
ముఖంపై నలుపు పోవాలంటే
- ముఖం పైన నలుపు పోవడానికి ముందుగా పచ్చి పాలతో ముఖాన్ని శుబ్రపరుచుకోవాలి. ఇలా శుబ్రపరుచుకున్న తరువాత మాత్రమే ప్యాక్ చక్కగా పనిచేస్తుంది.
- టమాటో మరియు చెక్కరని తీసుకొని టొమాటోని చెక్కరలో ముంచి నెమ్మదిగా ముఖం పైన రుద్దాలి.
- పెరుగు మరియు పసుపుని తీసుకొని రెండింటిని బాగా కలిపి ముఖం పైన చక్కగా మసాజ్ చేస్కోవాలి.
- ముఖం పైన నలుపు పోవడానికి చక్కగా ఉపకరిస్తుంది. ఈ మిశ్రమన్నె ప్యాక్ లాగా వేసుకొని 20 నిమిషాల తారువత కడిగితే, చక్కటి ఫలితాన్ని పొందుతారు.
Face glow tips for men in telugu
- అందం అందరికీ అవసరం అలాగే పురుషులు కూడా అందంగా ఉండాలని కోరుకుంటారు. అందంగా చర్మం మెరవడానికి సులువైన చిట్కా! ఒక స్పూన్ శనగ పిండి, ఒక స్పూన్ రెండు స్పూన్ల పెరుగు మరియు కొంచెం నిమ్మరసం వేసి బాగా కలిపి ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత చల్లని నీటితో కడగాలి. ఈ పేస్ ప్యాక్ చర్మానికి anti aging గా పని చేస్తుంది.
How to protect skin from sun in Telugu
- చర్మానికి ఎండ తగలకుండా ఎండ వలన చర్మం పాడావకుండా ఉండాలంటే కచ్చితంగా మన చర్మాన్ని సూర్యుడి ఎండ ముఖం పైన పడకుండా కాపాడుకోవాలి. ముఖ్యంగా మద్యాహన సమయంలో ఉండే ఎండ నుండి మన చర్మాన్ని రక్షించుకోవాలి, అతినిలలోహిత కిరణాలు ముఖం పైన పడకుండా చూసుకోవలి. ముఖాన్ని సూర్య కిరణాలు పడకుండా lotions వాడి చర్మాన్ని రక్షించుకోవాలి.
How to maintain face glow
- ఫేస్ గ్లో అనేది పోకుండా నిరంతరం అలాగే ఉండాలి అంటే మనం కొన్ని చిట్కాలు చేస్తూ ఉండాలి. మన ముఖం గ్లో అవ్వడం కోసం చేసిన చిట్కాను తరచుగా చేస్తూ ఉండాలి. ఎండలో ఎక్కువగా తిరగకూడదు.
- సరిపడా నీళ్ళు తాగడం.
- రోజు ఉదయం ఒక జ్యూస్ తాగాలి.
- ప్రతి రోజు మొలకలు తినాలి కనీసం మూడు రకాల మొలకలు తీసుకోవాలి.
- vegetable salads తినాలి.
- ఎక్కువగా పండ్లను మరియు పండ్ల రసాలు తాగుతూ ఉండాలి.
- బత్తాయి రసం, కొబ్బరి నీళ్ళు, దానిమ్మ రసం వంటివి తాగాలి.
Skin shining tips in telugu
- చర్మం నిగనిగలాడటానికి కొన్ని రకాల ఆహార పదార్థాలను రోజు తీసుకోవాలి.
పెరుగు
-
పెరుగులో ఎక్కువ పోషక విలువలు ఉంటాయి. చర్మం అందంగా మెరుస్తూ ఉండటానికి పెరుగు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. పెరుగులో ఉండే బాక్టీరియా చర్మం అందంగా కనిపించడానికి సహకరిస్తుంది కావున పెరుగును మనం రోజు తీసుకోవడం మంచిది.
రోజు రాత్రి పడుకునే ముందు పెరుగు అన్నం తింటే ముఖం అందంగా గ్లోయింగ్ గా కనిపిస్తుంది.
పెరుగులో చెక్కర వేసుకొని లేదా మజ్జిగ చేసుకొని తాగితే ఆరోగ్యానికి మరియు చర్మ సౌందర్యానికి చాలా మంచిది అని చెప్పవచ్చు.
దానిమ్మ పండు
దానిమ్మ పండులో vitamins అధికంగా ఉంటాయి శరీరంలో రక్తాన్ని పెంచి చర్మాన్ని కాంతి వంతంగా తయారు చేస్తుంది. కావున రోజు ఒక గ్లాస్ దానిమ్మ రసం తాగితే చర్మం పైన ఎటువంటి మచ్చలు మరకలు లేకుండ చేస్తుంది.
క్యారెట్
క్యారెట్ లో విటమిన్ A అధికంగా ఉంటుంది. క్యారెట్ మంచి పోషక విలువలు ఉంటాయి ప్రతి రోజు క్యారెట్ తినడం వలన చర్మం క్యారెట్ రంగు లాగా తయారు అవుతుంది. క్యారెట్ జ్యూస్ కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఒక రెండు క్యారెట్ లు తీసుకొని మిక్సీ లో వేసి జ్యూస్ చేసి కొంచెం తేనె కలుపుకొని తాగితే చక్కగా పని చేస్తుంది.
walnuts
walnuts లో విటమిన్ E, K లతో పాటు అనేకమైన పోషకాలు ఉంటాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి మరియు చర్మాన్ని మచ్చలు లేకుండా చేయడానికి సహకరిస్తుంది. చర్మ కణలు మెరుగుగా అవడానికి మరియు మృదువుగా అవుతాయి. పొడి చర్మం ఉన్నవారికి చక్కగా పని చేస్తాయి.
walnuts face ప్యాక్ - Face glowing Tips in Telugu
ఒక అయిదు walnuts తీసుకొని ఒక గంట లేదా అంతకంటే ఎక్కువ సమయం నానబెట్టాలి. ఆ తరువాత వాటిని మిక్సీ లో పట్టి పచ్చి పాలను కలపాలి ఈ మిశ్రమాన్ని ముఖానికి గొంతుకు రాసుకోవాలి. ఆ తరువాత circular motion లో 5 నిమిషాల పాటు మసాజ్ చేయాలి, ఆ తరువత 20 నిమిషాలకు గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా వారానికి మూడు సార్లు చేస్తే చర్మం మృదువుగా ఉంటుంది.
Juice for glowing skin - గ్లోయింగ్ స్కిన్ కోసం తాగాల్సిన జ్యూస్
చర్మం అందంగా కాంతి వంతంగా ఉండటానికి జ్యూస్ లు చక్కగా పని చేస్తాయి
వెజిటబుల్ జ్యూస్
ప్రతి రోజు ఉందయం vegetable జ్యూస్ తీసుకుంటే చర్మం తాజాగా నిగారిస్తూ కనిపిస్తుంది.
ఒక దోసకాయ రెండు క్యారెట్ లు ఒక beatroot ముక్క మరియు రెండు టొమాటోలు తీసుకొని శుబ్రంగా కడిగి ముక్కలుగా కోసి మిక్సీ పట్టి అందులో కొంచెం తేనె వేసుకొని తాగితే ఆరోగ్యంగా చర్మం కాంతి వంతంగా ఉంటుంది.
Face exercise for glowing skin in elugu
ముఖం అందంగా ఉండటానికి ఫేస్ ప్యాక్ మరియు ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు ముఖానికి exercise చేయడం కూడా చాలా మంచిది.
- కింద కూర్చొని నడుము నిటారుగా ఉంచి రెండు ముక్కుల నిండా గాలిని పీల్చి చెంపలను బూరెల లాగా ఉబ్బించి బిగపట్టి ఉంచాలి ఇలా 20 seconds ఉండాలి. ఆ తరువాత నోరు ని చిన్నగా తెరిచి బిగ పట్టిన గాలిని బయటకి పోయేలా చేయాలి ఇలా ఒక 6 సార్లు చేస్తే ముఖం లోని కండరాల కదళికలో మార్పులు వచ్చి ముఖం చక్కగా తయారు అవుతుంది.
- వెన్నుముక నిటారుగా ఉండేలా కూర్చొని ముక్కుతో గాలిని పీల్చి చెంపలలో గాలిని బిగ పట్టి మెల్లిగా తలని కింది అంటే గధవ ఛాతికి తాకేల చేయాలి చేయగలిగే అంత సేపు చేసి ఆ తరువాత మెడను నిటారుగా ఉంచి నోరు చిన్నగా తెరిచి ఆ గాలిని బయటకి మెల్లగా వదలాలి.
- రెండు చేతులను ముఖం పైన పెట్టి మెల్లిగా చెంపలను , నుదురు మరియు ముఖం అంతా కొట్టాలి.
- ముఖానికి facial చేసుకునేటప్పుడు గదవ నుంచి చెంపల పైకి చేసకువాలి, లేదా circular motion లో చేసుకోవాలి.
50% off : అతి తక్కువ ధరకి Face Wash, Amazon లో Order చేస్కోండి
కింద ఉన్న link క్లిక్ చేసి Discount పొందండి
Himalaya Face Wash Price : ₹ 243
Published by
Health Tips telugu
healthtipstelugu.in is the best resource for quality health tips in Telugu. Our website provides visitors with an easy way to find the best health tips for staying healthy and fit. We provide reliable health information in an easy-to-understand format, so you can make the most of your health.
Disclaimer: This post may include affliate links. lf you click one of them, we may receive a cute
commission at no extra cost to you. Thank you.
Health Tips Telugu is founded and maintained by a group of medical professionals and health enthusiasts passionate about providing accurate, up-to-date health information to Telugu speakers around the world. We follow strict editorial practices to provide only truthful, unbiased health guidance that readers can rely on. We reference reputable health organizations, academic medical centers and peer-reviewed journals when developing our articles.