ఆరోగ్యానికి చిరుధాన్యాలు చేసే అద్భుతాలు - Millets in Telugu
చిరుధాన్యాలు లేదా తృణధాన్యాల ఉపయోగాలు తెలుసుకోండి
- Updated on 10-01-2023
Meaning of Millets in Telugu:
Millets ని తెలుగులో “సిరిదాన్యాలు లేదా చిరు ధాన్యాలు” లేదా తృణధాన్యాలు అని కూడా అంటారు
Introduction to Millets
సిరి ధాన్యాలను చాల వరకు అనారోగ్యా సమస్యలు ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకుంటారు అనుకున్నారు, కానీ ఆరోగ్యాంగా వున్నవాళ్లు కూడా తీసుకోవచ్చు. ఆరోగ్యాంగా ఉన్నవారు సిరి ధాన్యాలను తీసుకోవడం వలన ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకూండా చక్కగా ఆరోగ్యాంగా ఉండటానికి సహకరిస్థాయి. ప్రతిరోజు ఏదో ఒక చిరు ధాన్యాన్ని మన ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యానికి చాల మంచిది మరియు అన్ని రకాల పోషక విలువలు మన శరీరానికి అందుతాయి.
రాగులు, కొఱ్ఱలు, జొన్నలు, సజ్జలు, సామలు, అరికెలు మరియు ఉధలు అన్నింటిని కలిపి సిరిధాన్యాలు అంటారు.ఇవి సన్నగా ఉండే గడ్డి లాంటి మొక్కల ద్వారా పెరుగుతాయి. వీటిని మనం ఆహారంలో భాగంగా చేసుకోవడం, మరియు వీటితో ఆహారపదార్థాలను తీసుకోవడం వలన మనం పూర్తి ఆరోగ్యాంగా బలంగా ఉండవచ్చు.
Millets లోని పూర్తి పోషకాలు మనకు అందలి అంటే మనం వాటిని ఎలా వాడాలి?
మరియు ఎలాంటి పదార్థాలను మనం తీసుకోవాలో ఈ ఆర్టికల్ ద్వారా పూర్తిగా తెలుసుకుందాం!
- సిరి ధాన్యాలలో తక్కువ కెలోరీలు ఉంటాయి. ప్రోటీన్ మరియు ఫైబర్ అధికంగా ఉండటం వలన బరువు తగ్గటానికి సహరిస్తాయి.
- ఈ సిరి ధాన్యాలలో రెండు రకాల ఫైబర్లు ఉంటాయి ఒకటి నీటిలో కరిగే ఫైబర్ (soluble fiber), రెండోది నీటిలో కరగని ఫైబర్(insoluble fiber).
- చిరు ధాన్యాలలో ఉండే కరగని ఫైబర్ (insoluble fiber) జీర్ణశక్తిని మెరుగుపరచి అన్నం చక్కగా జీర్ణం అవ్వడానికి సహకరిస్తుంది. మరియు మలబద్దకం వంటి సమస్యలను దూరం చేస్తుంది.
50% off : అతి తక్కువ ధరకి 5 రకాల మిల్లెట్స్ ను Amazon లో Order చేస్కోండి
Organic గా పండించిన మిల్లెట్స్ ని ఇప్పుడే Online లో Order చేస్కోండి
కింద ఉన్న link క్లిక్ చేసి డిస్కౌంట్ పొందండి
Types of Millets - మిల్లెట్స్ రకాలు
మనకు చిరుధాన్యాలు 8 రకాలుగా ఉంటాయి.
1) కొర్రలు - foxtail millet
2) రాగులు - finger millet
3) ఉధలు/కోడిసమా - barnyard millet
4) జొన్నలు - sorghum millet
5) సజ్జలు - pearl millet
6) వారిగులు - proso millet
7) అరికెలు - kodo millet
8) సామలు - little millet
50% off : అతి తక్కువ ధరకి 5 రకాల మిల్లెట్స్ ను Amazon లో Order చేస్కోండి
Organic గా పండించిన మిల్లెట్స్ ని ఇప్పుడే Online లో Order చేస్కోండి
కింద ఉన్న link క్లిక్ చేసి డిస్కౌంట్ పొందండి
సిరిధాన్యాలు బుక్ - Dr. Khader Vali
డా ఖాదర్ వలి గారు రాసిన సిరి ధాన్యాలు PDF ని ఇప్పుడే Download చేస్కోండి
Millets Images
Millets Video in Telugu
మిల్లెట్స్ యొక్క ప్రయోజనాలు ఈ క్రింది వీడియోలో చూడండి.
Uses of Millets – మిల్లెట్స్ ఉపయోగాలు
- రోజు చిరుధాన్యాలు తీసుకోవడం వలన మనం సంపూర్ణ ఆరోగ్యాంగా ఉంటాము.
- చిరుధాన్యాలు తీసుకునేటప్పుడు వాటిని నానబెట్టి మొలకలాగా తీసుకోవచ్చు, లేదా వేయించి పొడి చేసి జావా చేసి తీసుకోవచ్చు.
- చిరుధాన్యాలతో అన్నం వండుకొని తినడం, లేదా చెపాతి చేసుకొని ఎక్కువ కూరతో తినడం చాల మంచిది.
- చిరు ధాన్యాలను సరైన పద్ధతిలో వాడితే ఎటువంటి సమస్యలు ఉండవు.
- కొర్రలను తీసుకుంటే వేయించుకొని రవ్వలాగా పొడి చేసి నీటిలో నానబెట్టి అన్నం వండుకొని తీసుకుంటే చాల మంచిది.
మిక్సీతో సిరి ధాన్యాల బియ్యం తయారీ - Millets Recipe in Telugu
పుల్లలు, మట్టిగడ్డలు లేకుండా శుభ్రం చేసిన ముడి సిరిధాన్యాలను సిద్ధం చేసుకుని.. 5-6 గంటల పాటు
నానబెట్టాలి (ఇసుక నీటి అడుగుకు చేరుతుంది).
నానిన ముడి సిరిధాన్యాలను తీసి గచ్చు మీద ఎండబెట్టాలి. 1-2 రోజులు ధాన్యంలో తేమ పూర్తిగా పోయే వరకు ఎండబెట్టాలి. సరిగ్గా ఎండకపోతే బూజు వస్తుంది. బాగా ఎండిన ధాన్యం 2-8 ఏళ్లయినా నిల్వ ఉంటుంది. అవసరమైనప్పుడు బియ్యం చేసుకొని తినొచ్చు.
మిక్సీ జారు ఎత్తులో మూడొంతుల వరకు ముడి సిరిధాన్యాలను పోసి మూత పెట్టాలి. నిండుగా పోయకూడదు. మిక్సీ స్విచ్ జీరోలో ఉంటుంది. దీన్ని 1 ఉన్న వైపు తిప్పకూడదు. కొంచెం వెనక్కి (పల్స్ వైపు) తిప్పీతిప్పనట్లు తిప్పి కొద్ది సెకన్లలో వదిలెయ్యాలి. ఇలా సుమారు 50 సార్లు అనాలి. తర్వాత జారు మూత తీసి ధాన్యాన్ని చెరగాలి. కొంతమేరకు పొట్టు పోతుంది. మళ్లీ జార్‌లో పోసి మళ్లీ 30 సార్లు అదేమాదిరిగా చేసి చెరగాలి.
తర్వాత జల్లెడ పట్టాలి. అప్పటికీ పొట్టు ఊడని ధాన్యం పైకి తేలుతుంది. ఆ ధాన్యాన్ని తీసి మళ్లీ మిక్సీ జార్‌లో పోయాలి.
ఇలా… ఇంట్లో అయితే ఒక మిక్సీతో చిరుధాన్యం బియ్యాన్ని తయారు చేసుకోవచ్చు. వాణిజ్య సరళిలో
చేయాలనుకునే వారు 10 మిక్సీలతో మహిళా కూలీల ద్వారా శుద్ధి చేయించి, విక్రయించవచ్చు. ఏడాది
తిరగకముందే పెట్టుబడిని తిరిగి రాబట్టుకోవచ్చు.
సాధారణంగా 8 రకాల యంత్రాలను సిరిధాన్యాల శుద్ధికి వాడతారు. ఇందులో 20% వరకు నూకలు
వస్తాయి. మిక్సీ పద్ధతిలో 2-3% కన్నా ఎక్కువ నూక రాదు. నూకను కూడా ఉప్మా, పొంగలి, జావ
తయారీకి వాడుకోవచ్చు.
Advantages of Millets – మిల్లెట్స్ ద్వారా ప్రయోజనాలు
- చిరు ధాన్యాలు తీసుకున్నప్పుడు కడుపు నిండిన భావన కలిగి త్వరగా ఆకలి వేయకుండా ఉంటుంది. చిరు ధాన్యాలలో ఉండే ఫైబర్ వలన అలాంటి భావన వస్తుంది.
- గ్లూటెన్ సమస్య ఉన్న వారు మిల్లెట్స్ ని చక్కగా వాడొచ్చు.
- చిరు ధాన్యాలలో అధికంగా పోషక విలువలు ఉండటం వలన మన శరీర ఆకృతిని చక్కగా ఉంటుంది.
- శరీరంలో ఫాట్ మరియు కొలెస్ట్రాల్ ని తగ్గించి ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా చిరుధాన్యాలు సహకరిస్తాయి.
- BP, షుగర్ మరియు గుండె సంబంధిత వ్యాధులను నయం చేసి ఆరోగ్యాంగా ఉండటానికి సహకరిస్తాయి.
- రక్తహీనత సమస్య నుంచి కూడా దూరం చేసి రక్తం పెరగటానికి సహకరిస్తుంది.
- ఎక్కువ శారీరక శ్రమ చేసే వాళ్ళకి తొందరగా అలసట రాకుండా దృడంగా మరియు ఆరోగ్యాంగా చిరుధాన్యాలు దోహదపడుతాయి.
- ఒక్కొక్క చిరుధాన్యానికి ఒక్కొక్క కుకింగ్ టైం ఉంటుంది కావున అన్ని కలిపి ఒకేసారివండకూడదు.
Disadvantages of Millets
- ఆరోగ్యానికి ఎంత మేలు చేసేవి అయినా అతిగా తీసుకోవడం మంచిది కాదు.
- ఒక రోజు ఒక రకమైన చిరుధాన్యం తీసుకుంటే మరసటి రోజు వేరొక చిరు ధాన్యం తీసుకోవాలి.
- ఒక పూట జొన్నలు తీసుకుంటే మరొక పూత అన్నం లేదా brown rice తీసుకోవాలి, ఇలా మార్చి మార్చి తీసుకోవాలి.
- ఒకవేళ రోజు ఒకటే రకమైన చిరు ధాన్యం తీసుకుంటే ఒక రకమైన విటమిన్స్ మన శరీరానికి అధికంగా లభిస్తాయి ఇలా జరగటం మంచిది కాదు.
How to Use Millets? – మిల్లెట్స్ ఎలా వాడాలి ?
ఒక్క అండుకొర్రలను మాత్రం కనీసం 4 గంటలు నానబెట్టిన తరువాతే వండుకోవాలి. మిగతా సిరిధాన్యాలను
అలాగ ఈ ఐదు రకాల సిరిధాన్యాలు మొదటి సిరిధాన్యంతో ప్రారంభించాలి. వీటితోపాటు కషాయాలు కూడా తీసుకోగల్లితే మంచిది.
ఉదాహరణకు సుగర్, కిడ్నీ సమస్యలు ఒకరికే ఉంటే వారు అరికలు 3 రోజులు, ఊదలు 3 రోజులు తింటూ మిగతా 3 రకాల ధాన్యాలను ఒక్కొక్క రోజు తినాలి.
ఈ సమస్యతో పాటు ప్రొస్టేటు సమస్య కూడా ఉంటే సామలు కూడా 3 రోజులు తింటూ మిగిలిన రెండు ధాన్యాలను ఒక్కొక్క రోజు తినాలి.
Nutritional Facts in Millets
Millets లో ఉండే పోషక విలువలు
- Vitamin A.
- Vitamin B.
- Phosphorus.
- Potassium.
- Antioxidants.
- Niacin.
- Calcium.
- Iron.
సిరిధాన్యాలు బుక్ - Dr. Khader Vali
డా ఖాదర్ వలి గారు రాసిన సిరి ధాన్యాలు PDF ని ఇప్పుడే Download చేస్కోండి
All Millets Benefits in Telugu
1) కొర్రలు - Foxtail Millets in Telugu
కొఱ్ఱలను italian millet అని కూడా అంటాము. హిందీలో kangni అంటాము. కొర్రలు పూర్వకాలం నుంచి అతి ప్రాముఖ్యత కలిగినటువంటి చిరుధాన్యం అని చెప్పవచ్చు.
కొర్రలలో అధిక పోషకవిలువలు ఉంటాయి.
కొర్రలు చవకగా దొరుకుతాయి. కొర్రలను అన్నం లాగా కూడా తినవచ్చు.
కొర్రలు పైన భాగం గట్టిగ ఉంటుంది ఉడకడానికి ఎక్కువ సమయం పడుతుంది, వీటిని కొంచెం సేపు నానబెట్టి వండాలి ఇలా చేస్తే త్వరగా ఉడుకుతాయి, కొర్రలు పొట్టలో నెమ్మదిగా అరుగుతాయి 100 గ్రాముల కొర్రలలో 331 కాలేరీస్ 62 గ్రామ్స్ కార్బోహైడ్రాట్స్ 12గ్రాముల మాంసకృత్తులు ఉంటాయి.
8గ్రాములు ఫైబర్లు 2. 5 గ్రాముల కొవ్వులు ఉంటాయి. ఉపయోగాలు కొర్రలు కొంచెం తిన్నప్పటికీ ఆకలి వేయకుండా ఉంటుంది వీటిలో ఉండే ప్రోటీన్ మరియు ఫైబర్ వలన నెమ్మదిగా అరుగుతుంది. బరువు తగ్గటానికి సహకరిస్తుంది. Tryptophan ఉండటమే వలన ఆకలి తగ్గుతుంది. చర్మం ముడతలు పడకుండా స్కిన్ టైట్ అవ్వడానికి సహకరిస్తుంది.
కొర్రలో ఉండే లైసితిన్ మరియు myth finn వల్ల శరీరంలో fat తగ్గే అవకాశం ఉంది. కొర్రలలో thorin అనే’కెమికల్ ఉండటం వలన కాలేయం లో కొవ్వు తగ్గటం కొర్రలు గ్లూటెన్ ఫ్రీ ఆహార పదార్థం ప్రేగుల పొరలకు ఎటువంటి హాని కలగదు.
ప్రేగులలో మంచి బాక్టీరియా పెరగటానికి సహకరిస్తుంది కొర్రలలో ఉండే అధిక ఫైబర్ వలన glucose నెమ్మదిగా రక్తంలోకి వెళ్తుంది షుగర్ లెవల్స్ పెరగకుండా చేస్తుంది.
కొర్రలను శారీరక శ్రమ ఎక్కువ చేసేవాళ్లు, బరువు పెరగాలి అనుకునే వాళ్లు, కండ పట్టాలు అనుకునే వాళ్లు, గర్భిణీ స్త్రీలు బాలింతలు అందరు వాడవచ్చు
50% off : అతి తక్కువ ధరకి 5 రకాల మిల్లెట్స్ ను Amazon లో Order చేస్కోండి
Organic గా పండించిన మిల్లెట్స్ ని ఇప్పుడే Online లో Order చేస్కోండి
కింద ఉన్న link క్లిక్ చేసి డిస్కౌంట్ పొందండి
2) రాగులు - Finger Millets in Telugu
రాగులు బలవర్ధకమైన ఆహారపదార్థం పూర్వకాలంలో 100గ్రాములలో 7.3గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.344గ్రాముల కాల్షియమ్ ఉంటుంది, 1.6 గ్రాముల ఫైబర్ ఉంటుంది. రాగులలో నీటిలో కరిగే ఫైబర్ మరియు కరగని ఫైబర్ రెండు ఉంటాయి.
ఇది మన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ LDL ని తగ్గిస్తుంది. షుగర్ వ్యాధిని తగ్గించడానికి సహకరిస్తుంది. బరువు తగ్గడానికి సహకరిస్తుంది, స్కిన్ కి ఆంటీ ageing లాగా పని చేస్తుంది. యవ్వనంగా ఉండటానికి సహకరిస్తుంది.anti microbial properties కూడా ఉంటాయి. చాల మినిరల్స్ ఉంటాయి.
3) ఉధలు/కోడిసమా - Barnyard Millets in Telugu
ఉదలను ఇంగ్లీష్ లో Barnyard అంటాము. తెలుగులో ఉదలు లేదా కోడిసమ అంటాము. ఉదాలలో సమర్థ వంతమైన విటమిన్స్ తక్కువ కాలేరీస్ మరియు మినరల్స్ ఉంటాయి.
100 గ్రాముల ప్రోటీన్స్ లో 15.1 గ్రాముల ప్రోటీన్స్, 5. 3 గ్రాముల ఫైబర్ , 87గ్రాముల కాల్షియమ్ 4. 4 గ్రాముల ఐరన్ ఉంటాయి. మనం ఒక రోజుకి 30గ్రాముల ఉదలు తీసుకున్న ఆరోగ్యానికి మంచిది.
బరువు తగ్గటానికి, షుగర్ వ్యాధిని నియంత్రించడానికి సహకరిస్తుంది, హిమోగ్లోబిన్ ని మెరుగుపరచడానికి సహకరిస్తుంది.
4) జొన్నలు - Sorghum Millets in Telugu
జొన్నలను హిందీలో జావర్ అంటాము ఇంగ్లీష్ great millet లేదా Sorghum అంటాము. జొన్నలలో ఎక్కువగా విటమిన్స్ మరియు మినరల్స్ , సూక్ష్మ పోషకాలు మరియు ఐరన్ అధికంగా ఉంటుంది.
100గ్రాముల జొన్నలలో 1.73గ్రాముల soluble fiber ఉంటుంది, ఇది కొలెస్ట్రాల్ని తగ్గించడానికి సహకరిస్తుంది. 100గ్రాముల జొన్నలో 10.4 ప్రోటీన్స్ ఉంటాయి. జొన్నలు ఫ్రీ రాడికల్స్ కి వ్యతిరేకంగా పనిచేస్థాయి.
జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరుస్తూ ఉంటుంది, melanoma నుంచి రక్షణ కల్పిస్తుంది.
5) సజ్జలు - Pearl Millets in Telugu
సజ్జలను తెలుగులో సజ్జలు అంటాము హిందీలో బాజ్ర అని ఇంగ్లీషులో pearl millet అంటారు. సజ్జలు మన గుండె ఆరోగ్యానికి చాల మేలు చేస్తాయి. సజ్జలు soluble ఫైబర్ ని అందించే చక్కటి సిరి ధాన్యం అని చెప్పవచ్చు.
100గ్రాముల సజ్జలలో 2.3గ్రాముల ఫైబర్ ఉంటుంది, కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడానికి సహకరిస్తుంది. సజ్జలలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది.
100గ్రాముల సజ్జలలో 8గ్రాముల ఐరన్ ఉంటుంది ఎవరికైనా గ్లూటెన్ ప్రాబ్లెమ్ ఉంటె అంటే గోధుమ పిండిలో గ్లూటెన్ ఉంటుంది. ఆ గ్లూటెన్ వలన గోధుమ పిండిని ఆహారంలో భాగం చేసుకొనే తీసుకోవడం వలన వాళ్ళకి కడుపులో నొప్పి లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అలాంటి వారు చక్కగా సజ్జలను గోధుమ పిండికి బదులుగా వాడవచ్చు. మలబద్దకాన్నితగ్గిస్తుంది
6) వారిగులు - Proso Millets in Telugu
వారిగులను హిందీలో పానివారగు అంటాము ఇంగ్లీషులో proso millet అంటాము వరిగులలో చాల రకాల పోషక విలువలు ఉంటాయి. వరిగులలో fat తక్కువగా ఉంటుంది 100గ్రాముల వారిగులలో 1.1 గ్రాముల fat ఉంటుంది.
100 గ్రాముల వారిగులలో 12. 5 గ్రాముల protein ఉంటుంది. వారిగులను సలాడ్స్ లో కూరగాయలలో కూడా కలుపుకొని వండుకోవచ్చు , ఫైబర్ అధికంగా ఉంటుంది బరువు తగ్గటానికి సహకరిస్తుంది.
వారిగులలో phosphorus అధికంగా ఉండటం వలన nervous system ఆరోగ్యాంగా ఉండటానికి సహకరిస్తుంది. ఆంటీ ageing గా కూడా చక్కగా పని చేస్తుంది.
7) అరికెలు - Kodo Millets in Telugu
అరికెలను హిందీలో వర్గు అంటాము ఇంగ్లీష్ లో kodo millet అని అంటాము. 100 గ్రాముల అరికెలలో అధికంగా 2.11 గ్రాముల soluble fiber దొరుకుతుంది 100 గ్రాముల అరికెలలో అధికంగా 8. 3 గ్రాముల ప్రోటీన్స్ ఉంటాయి.
Cardiovascular disease నుంచి కాపాడటానికి అరికెల ఉపయోగపడుతాయి. Fats తక్కువగా ఉంటాయి, ఇందులో ఎక్కువగా lecithin అధిక మొత్తంలో ఉంటుంది. అరికెల మన nervous system కి బలాన్ని చేకూరుస్తాయి, మరియు సులభంగా’జీర్ణం అవుతాయి అధిక రక్తపోటుని నివారించడానికి మరియు కొలెస్ట్రాల్ని తగ్గించడానికి అరికెల చక్కగా సహకరిస్తాయి.
8) సామలు - Little Millets in Telugu
సామలను హిందీలో సమాల్ అంటాము. వీటిలో ఎక్కువగా మినరల్స్ రైస్ కన్నా 13 రేట్ల ఐరన్ ఉంటుంది గోధుమల కన్నా 38 రేట్ల ఫైబర్ ఉంటుంది. ఇందులో తక్కువగా fat ఉంటుంది. మన శరీరంలో రక్తాన్ని పెంచడంలో మరియు హిమోగ్లోబిన్ ని మెరుగుపరచడంలో చక్కగా పనిచేస్తుంది.
సామలలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది.
100గ్రాముల సామలలో 9. 3 గ్రాముల iron, 2.2 గ్రాముల ఫైబర్ మరియు 7.7గ్రాముల ప్రోటీన్, ఉంటుంది. సోలబులే ఫైబర్ ఎక్కువగా ఉంటాయి కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహకరిస్తుంది. Type 2 diabetes నివారించడంలో సహాయపడుతుంది.
Note
Mixed మిల్లెట్స్ వాడకూడదు
ఎప్పుడైనా సరే mixed millets వాడకూడదు. రెండు రోజులు కి ఒకరకమైన మిల్లెట్స్ని తీసుకొవడం వలన మన శరీరానికి సరిపడా అని రకాల పోషకాలను పొందటమే కాకుండా ఆరు నెలల వ్యవధిలోనే BP, Sugar వంటి సమస్యలు తగ్గిపోతాయి.
Frequently Asked Questions
రోజుకి ఎన్ని గ్రాముల మిల్లెట్స్ ని తినవచ్చు?
హైదరాబాద్‌లోని ICMR-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ప్రకారం, న్యూట్రి-తృణధాన్యాలు (మిల్లెట్స్) సహా 270 గ్రాముల తృణధాన్యాలు తీసుకోవాలి. కాబట్టి, మీరు మిల్లెట్లను తీసుకుంటే, మీరు సిఫార్సు చేసిన పరిమాణంలో 1/3 rd (రోజుకు 90-100gm మిల్లెట్లు) తీసుకోవచ్చు.
Published by
Health Tips telugu
healthtipstelugu.in is the best resource for quality health tips in Telugu. Our website provides visitors with an easy way to find the best health tips for staying healthy and fit. We provide reliable health information in an easy-to-understand format, so you can make the most of your health.
Health Tips Telugu is founded and maintained by a group of medical professionals and health enthusiasts passionate about providing accurate, up-to-date health information to Telugu speakers around the world. We follow strict editorial practices to provide only truthful, unbiased health guidance that readers can rely on. We reference reputable health organizations, academic medical centers and peer-reviewed journals when developing our articles.