సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలు -Cervical Cancer Symptoms in Telugu
సర్వైకల్ క్యాన్సర్ మహిళలకు వచ్చే క్యాన్సర్లలో సర్వైకల్ క్యాన్సర్ అత్యంత ప్రాణాంతకమైనది. ప్రతి సంవత్సరం, లక్షలాది మంది మహిళలు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఈ క్యాన్సర్ గురించి అవగాహన కలిగి ఉండటం మరియు ముందు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకుండా ఉండవచ్చు.
సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏమిటి సర్వైకల్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది. Cervical Cancer రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
సాదారణంగా సర్వైకల్ కాన్సర్ ను మొదటి దశలో ఉన్నప్పుడు గుర్తించడం అసాద్యం అనే చేప్పవచ్చు. ఎందుకంటే మొదటి దశలో సర్వైకల్ కాన్సర్ ని గుర్తించేందుకు ఎక్కువ లక్షణాలు కనిపించవు.
సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలు - Symptoms of Cervical Cancer in Telugu
- యోని రక్తస్రావం: లైంగిక సంపర్కం తర్వాత, పీరియడ్స్ రావలసిన సమయం కంటే ముందే రావటం, మెనోపాజ్ తర్వాత రక్తస్రావం అధికంగా జరగటం సర్వైకల్ క్యాన్సర్ యొక్క ప్రారంభ లక్షణం.
- దుర్వాసనతో కూడిన యోని ద్రవాలు: రక్త స్రావం అధికంగా అవటం, యోని దుర్వాసనతో కూడి ఉండడం వంటివి క్యాన్సర్ లక్షణాలు కావచ్చు.
- కలయిక సమయంలో నొప్పి: పెల్విక్ నొప్పి, కలయిక సమయంలో నొప్పి కూడా సర్వైకల్ క్యాన్సర్ కు సంకేతాలు.
- ఇతర లక్షణాలు: వెన్నునొప్పి, కాళ్ల వాపు, అలసట, బరువు తగ్గడం వంటివి కూడా క్యాన్సర్ లక్షణాలు కావచ్చు తరుచూ అనారోగ్యానికి గురికావటం వంటివి కూడా లక్షణాలు గా బావించవచ్చు.
- అలసట: శరీరానికి శ్రమని కలిగిచ్చే పనులు చేయకపోయిన ఎక్కువగా అలిసిపోవటం ఇంకా తరచూ అనారోగ్యానికి గురికావటం.
- ఆకలి లేకపోవడం: ఆహారం తీస్కోవాలనే కోరిక తగ్గిపోవడం, ఆకలి మందగించడం వంటివి కూడా సర్వైకల్ కాన్సర్ లక్షణాలు అని చెప్పవచ్చు.
- మూత్ర విసర్జన: మూత్ర విసర్జన సమయంలో నొప్పి కలగటం, ఇబ్బందిగా ఉండటం వంటివి జరుగుతాయి.
సర్వైకల్ క్యాన్సర్ రావడానికి కారణాలు: - Reasons of Cervcal Cancer in telugu
- హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV): సర్వైకల్ క్యాన్సర్ కు ప్రధాన కారణం HPV. లైంగిక సంపర్కం ద్వారా వ్యాపించే ఈ వైరస్, గర్భాశయ ముఖద్వారం లోని కణాలలో మార్పులను కలిగిస్తుంది. ఈ మార్పులు క్యాన్సర్ కు దారి తీస్తాయి.
- ఇతర కారణాలు: ధూమపానం, రోగనిరోధక శక్తి లోపం, అనేక సంతానాలు కలిగి ఉండడం, హార్మోన్ల పనితీరు సక్రమంగా లేకపోవడం మందుల వాడకం వంటివి కూడా సర్వైకల్ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి.
- మొదటి గర్బనికి రెండో గర్బానీకి మధ్య ఎక్కువ గ్యాప్ ఉండకపోవటం వలన cervical Cancer వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
- చిన్న వయసులో లైంగిక కార్యక్రమలో పాల్గొనడం వంటివి చేసిన వారిలో Cervical Cancer ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది.
- పోషకా ఆహారం లోపం ఉన్నవాళ్ళకి కూడా గర్బశయ కాన్సర్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది.
- పొగాకు తినే ఆడవాళ్ళలో కూడా గర్బశయ కాన్సర్ రావచ్చు .
గర్బశయ కాన్సర్ అంటే ఏమిటి?
సర్వైకల్ క్యాన్సర్ అనేది మహిళల్లో సర్వైక్స్‌లో వచ్చే ఒక రకమైన క్యాన్సర్. సర్వైక్స్ అనేది గర్భాశయానికి యోనిని కలిపే భాగం.
సర్వైకల్ క్యాన్సర్ నివారణ: - Cervical Cancer in telugu
- HPV వ్యాక్సిన్: HPV వ్యాక్సిన్ సర్వైకల్ క్యాన్సర్ ను నివారించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది. HPV వ్యాక్సిన్ ని 9 నుండి 26 సంవత్సరాల వయస్సు గల బాలికలు, బాలురకు ఈ వ్యాక్సిన్ వేయించడం చాలా ముఖ్యం.
- పాప్ స్మియర్ పరీక్ష: పాప్ స్మియర్ పరీక్ష ద్వారా సర్వైకల్ క్యాన్సర్ ను ముందుగానే గుర్తించవచ్చు. 21 సంవత్సరాల వయస్సు పైబడిన వారికి మరియు స్త్రీలు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ఈ పరీక్ష చేయించుకోవడం మంచిది.
- లైంగిక సంపర్కం సమయంలో జాగ్రత్తలు: ఒకే భాగస్వామితో ఉండడం, లైంగిక సంపర్కం సమయంలో కాండోమ్ వాడడం వంటి జాగ్రత్తలు HPV వ్యాప్తిని అరికట్టడంలో సహాయపడతాయి.
స్త్రీలలో గర్బశయ కాన్సర్ రాకుండా తీస్కోవాల్సిన ఆహారాలు - Foods to Prevent Cervical Cancer in telugu
ఆరోగ్యాన్ని అనారోగ్య సమస్యల నుంచి కాపాడుకోవడానికి మరియు అనేక అనారోగ్యాల ప్రమాదాన్ని తగ్గించడానికి పోషక ఆహారాలను తీస్కోవడం ముఖ్యం.
- ఆరోగ్యకరమైన బరువును పెంచుకోవడం, శరీరంలో కొవ్వు లేకుండా నియంత్రించడం.
- శారీరకంగా చురుకుగా ఉండండి.
- ఎక్కువ కేలరీలు మరియు ప్రోటీన్లు ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి.
- పండ్లు, కూరగాయలు డ్రైఫ్రూయిట్స్ మరియు గింజలను పుష్కలంగా తీసుకోండి.
- ప్రాసెస్ చేసిన మాంసాన్ని మరియు ఆహార పదార్థాలను వీలైనంత తక్కువ తీసుకోండి.
- మద్యపానాన్నిమానుకోవడం మంచిది.
కానీ కొన్ని రకాల ఆహారాలు తినడం సర్వైకల్, అండాశయ మరియు ఎండోమెట్రియల్ క్యాన్సర్ (గర్భాశయ క్యాన్సర్) వంటి కొన్ని స్త్రీల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయని మీకు తెలుసా?
సర్వైకల్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి మీరు ఏం తినాలి? - Cervical Cancer in Telugu
చాలా సర్వైకల్ క్యాన్సర్‌లు హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV) అనే సాధారణ లైంగిక సంక్రమణ వ్యాధి వల్ల వస్తుంది. HPV తో బాధపడె మహిళలు, రోజుకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ నిర్దిష్ట కూరగాయల సేర్విన్‌లను తీసుకోవడం మంచిది. ఇలా చేయడం వలన శరీరంలోని వైరస్‌ను తొలగించడంలో సహాయపడుతుందని ఒక అధ్యయనంలో తేలింది.
- చిలగడ దుంపలు
- పాలకూర, ఆకుకూరలు
- నారింజ, బొప్పాయ ఆపిల్
- గోరు చిక్కుడు
- టమోటాలు,కాలీఫ్లవర్
- డ్రాగన్ ఫ్రూట్,కివి
- అవిసె గింజలు, చియా విత్తనాలు
అండాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించే ఆహారాలు ఏవి?
- ఆహారం మరియు నిర్దిష్ట రకాల క్యాన్సర్‌ల మధ్య సంబంధానికి మరింత ఆధారాలు కావాలనుకుంటే, నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ (NIH)లోని నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నిర్వహించిన AARP సభ్యులలో జరిగిన పెద్ద పరిశోధనా ఫలితాల ద్వారా గమనించ దాగిన విషయం ఏమిటంటే?
అత్యధిక మొత్తం కొవ్వు తీసుకునే మహిళలకు మరియు అత్యల్ప కొవ్వు తీసుకునే వారికంటే అండాశయ క్యాన్సర్ వచ్చే అవకాశం 28 శాతం గా ఉంది.
Frequently Asked Questions about Cervical Cancer in Telugu
Published by
సర్వైకల్ క్యాన్సర్ అనేది గర్భాశయ ముఖద్వారంలోని కణాలు అసాధారణంగా పెరగడం వల్ల వచ్చే క్యాన్సర్. ఇది మహిళల్లో అత్యంత ప్రాణాంతక క్యాన్సర్లలో ఒకటి.
హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV) అనే లైంగిక సంపర్కం ద్వారా వ్యాపించే వైరస్ సర్వైకల్ క్యాన్సర్ కు ప్రధాన కారణం. ఇతర కారణాలు ధూమపానం, రోగనిరోధక శక్తి లోపం, అనేక సంతానాలు కలిగి ఉండడం, హార్మోన్ల సమస్య మరియు ఎక్కువగా మందుల వాడకం వంటివి కారణాలు.
యోని రక్తస్రావం (లైంగిక సంపర్కం తర్వాత, పీరియడ్స్ తొందరగా రావడం,)
దుర్వాసనతో కూడిన యోని ద్రవాలు
కలయిక సమయంలో నొప్పి
వెన్నునొప్పి, కాళ్ల వాపు, అలసట, బరువు తగ్గడం వంటి ఇతర లక్షణాలు
- HPV వ్యాక్సిన్: 9 నుండి 26 సంవత్సరాల వయస్సు గల బాలికలు, బాలురకు ఈ వ్యాక్సిన్ వేయించడం చాలా ముఖ్యం.
- పాప్ స్మియర్ పరీక్ష: 21 సంవత్సరాల వయస్సు నుండి ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ఈ పరీక్ష చేయించుకోవడం మంచిది.
- లైంగిక సంపర్కం సమయంలో జాగ్రత్తలు: ఒకే భాగస్వామితో ఉండడం, కాండోమ్ వాడడం వంటివి.
అవును, సర్వైకల్ క్యాన్సర్ కు వివిధ చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. చికిత్స రకం క్యాన్సర్ స్టేజ్, వయస్సు, ఇతర ఆరోగ్య పరిస్థితులను బట్టి ఉంటుంది. సర్జరీ, రేడియేషన్, కీమోథెరపీ వంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి.
- ప్రభుత్వ ఆరోగ్య శాఖ వెబ్‌సైట్‌లు
- క్యాన్సర్ సంస్థల వెబ్‌సైట్లు (American Cancer Society, World Health Organization)
- డాక్టర్లు, వైద్య నిపుణులు ద్వారా సమాచారాన్ని పొందవచ్చు.
Health Tips telugu
healthtipstelugu.in is the best resource for quality health tips in Telugu. Our website provides visitors with an easy way to find the best health tips for staying healthy and fit. We provide reliable health information in an easy-to-understand format, so you can make the most of your health.
Health Tips Telugu is founded and maintained by a group of medical professionals and health enthusiasts passionate about providing accurate, up-to-date health information to Telugu speakers around the world. We follow strict editorial practices to provide only truthful, unbiased health guidance that readers can rely on. We reference reputable health organizations, academic medical centers and peer-reviewed journals when developing our articles.